మోదీని కించపరిస్తే తాటతీసి తరిమికొడతాం

17 May, 2022 09:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర మంత్రి అమిత్‌షా సభ విజయవంతం కావడంతో టీఆర్‌ఎస్‌ నేతలకు కంటిమీద కునుకు లేకుండాపోయిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ మెప్పుకోసం పనిలేని, పనికిరాని రాష్ట్ర మంత్రులు బీజేపీపై పిచ్చి ప్రేలాపనలతో విమర్శలు చేస్తున్నారన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇకపై ప్రధాని మోదీ మొదలుకుని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలను కించపరుస్తూ ఇష్టానుసారం మాట్లాడితే రాష్ట్ర మంత్రులను తెలంగాణలో తిరగనివ్వబోమని, తాట తీయడంతో పాటు వారిని తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.

సభలో అమిత్‌షా చేసిన విమర్శల్లో ఏది అబద్ధమో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దళిత సీఎం మొదలు ఎస్సీలకు 3 ఎకరాలు, దళితబంధు, నిరుద్యోగభృతి ఇతర హామీలను గాలికొదిలేయడం, పీఎంఆవాస్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథ కాలు అమలు చేయకపోవడం అవాస్తవమా అని ప్రశ్నించారు. రాష్ట్ర కేబినెట్‌లోనే అత్యంత అవినీతి కేటీఆర్‌ మున్సిపల్‌ శాఖలోనే జరుగుతోందని ఆరోపించారు. 
చదవండి👇
Hyderabad: పెద్ద అంబర్‌పేట్‌లో స్కూల్‌ బస్సు బీభత్సం
8 ఏళ్ల కిందటి ‘అచ్ఛేదిన్‌’ ఇవేనా..?: మోదీ ట్వీట్‌పై కేటీఆర్‌

మరిన్ని వార్తలు