మునుగోడుపై స్పీడ్‌ పెంచిన కాంగ్రెస్‌.. రేవంత్‌ లేకుండా వరుస భేటీలు

17 Aug, 2022 09:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రస్తుత పాలిటిక్స్‌ మొత్తం మునుగోడుపైనే చర్చిస్తోంది. రాజకీయ పార్టీలు మునుగోడు ఉప ఎన్నికలపై ఫోకస్‌ పెట్టాయి. ఇందులో భాగంగానే పార్టీలు అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. 

ఇదిలా ఉండగా.. మునుగోడులో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్‌ కీలక సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. కాగా, మునుగోడు ఉప ఎన్నిక అంశంపై కాంగ్రెస్‌ పార్టీ ఏఐసీసీ సెక్రటరీలతో మంగళవారం రాత్రి ఇంచార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ సమావేశమయ్యారు. సర్వే నివేదికల ఆధారంగా నేతల అభిప్రాయాలపై సమీక్ష నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు.. గాంధీభవన్‌లో బుధవారం కూడా మాణిక్యం ఠాగూర్‌.. కాంగ్రెస్‌ నేతలతో కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఉదయం మునుగోడుకు సంబంధించి స్ట్రాటజీ కమిటీని నియమించింది. ఈ కమిటీలోని సభ్యులతో బుధవారం ఉదయం ఠాగూర్‌ సమావేశం కానున్నారు. అలాగే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో కూడా ఠాగూర్‌ భేటీ కానున్నారు. అ‍యితే, ఈ వరుస భేటీల్లో మునుగోడుపైనే చర్చించనున్నట్టు తెలుస్తోంది. 

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ను వీడటంతో ఆయన వెంటనే ఎంత మంది కాంగ్రెస్‌ నేతలు పార్టీని వీడారు, పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ఎక్కువగా ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం. ఇక, మునుగోడు నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో ఇన్‌చార్జీలను నియమించి ఈ నెల 20వ తేదీన ప్రతీ గ్రామంలో పాదయాత్ర చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఇక, గురువారం కూడా ఠాగూర్‌ కాంగ్రెస్‌ నేతలతో సమావేశం కానున్నారు. అయితే, ఈ సమావేశాల్లో టీపీసీసీ రేవంత్‌ రెడ్డి పాల్గొనడం లేదు. కరోనా కారణంగా కాంగ్రెస్‌ సమావేశాలకు రేవంత్‌ దూరంగా ఉన్నారు. 

ఇది కూడా చదవండి: జనగామలో హై టెన్షన్‌.. టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ

మరిన్ని వార్తలు