మంత్రి మల్లారెడ్డి నోరు అదుపులో పెట్టుకో 

27 Aug, 2021 09:03 IST|Sakshi
మాట్లాడుతున్న నాగుల సత్యనారాయణ గౌడ్‌

సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్‌): బాధ్యతగల మంత్రిగా కొనసాగుతున్న మల్లారెడ్డి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌పై చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని డీసీసీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్‌ అన్నారు. గురువారం సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్లో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి అధికార పార్టీనేతలు, మంత్రివర్గంలో వణుకు పుడుతోందన్నారు. ప్రజాభిమానం పొందుతున్న టీపీసీసీ ప్రెసిడెంట్‌పై బహిరంగంగా మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు.

నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేనిపక్షంలో ప్రజలచే సరైన గుణపాఠం చెబుతామన్నారు. జిల్లా కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు మడుపు శ్రీదేవి, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు తదితరులు పాల్గొన్నారు.  

చదవండి: దిశ ఎన్‌కౌంటర్‌పై నేడు విచారణ

మరిన్ని వార్తలు