కేసీఆర్‌ నిరంకుశత్వాన్ని బొందపెడ్తాం: ఈటల 

24 Aug, 2021 02:54 IST|Sakshi

హుజూరాబాద్‌: సీఎం కేసీఆర్‌ నిరంకుశత్వాన్ని బొందపెట్టడానికి రాష్ట్రమంతా ఎదురుచూస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. సోమవారం కాట్రపల్లి గ్రామానికి చెందిన పలువురు బీజేపీలో చేరిన సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఆత్మగౌరవ బావుటా ఎగురవేశానని, గెలిస్తే ఏకుమేకవుతాననే భయంతో ఓడించాలని చూస్తున్నారని ఆరోపించారు. తనపై ప్రత్యేక నిఘా పెట్టారని, వందల మంది పోలీసులను మఫ్టీలో దిం పారని పేర్కొన్నారు. పెన్షన్లు, రేషన్‌కార్డులు రావని ప్రజలను భయపెడ్తున్నారని.. అవి ఆగవని, ఆపే శక్తి ఎవరికీ లేదని ఈటల చెప్పారు. హుజూరాబాద్‌కు వస్తున్న నాయకులు ముందు వాళ్ల నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసి చూపాలని సవాల్‌ చేశారు. 

మరిన్ని వార్తలు