తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోంది: ఈటల

23 Jun, 2021 13:59 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ధ్వజమెత్తారు. గొప్ప పార్టీలు ప్రజలను, వ్యవస్థను నమ్ముకుంటాయని, సీఎం కేసీఆర్ డబ్బు, మోసం, కుట్రలను నమ్ముకున్నారని మండిపడ్డారు.టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రస్తుతం హుజురాబాద్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ కుట్రలకు చరమగీతం పాడే నియోజకవర్గం హుజురాబాద్ అని పేర్కొన్నారు. హుజురాబాద్‌లో ధర్మమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు