తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌

16 Nov, 2023 21:29 IST|Sakshi

Telangana Assembly Elections Updates..

ట్విటర్‌లో కాంగ్రెస్ నేత చిదంబరానికి కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

👉1952-2014 వరకు వందలాది మంది తెలంగాణ యువకుల ప్రాణాలు తీయడానికి మీ పార్టీదే బాధ్యత. 
👉మీరు ఇప్పుడు ఎంత కష్టపడినా, కాంగ్రెస్ మాపై చేసిన దౌర్జన్యాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.

సీఎం కేసీఆర్‌పై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ

👉బహిరంగ సభల్లో రెవెన్యూ అధికారులపై దుర్బాషలాడారని, అధికారులపై అవినీతి ముద్ర వేసారని ఫిర్యాదు
👉ముఖ్యమంత్రి భహిరంగ సభల్లో ఇలా మాట్లాడితే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న కాంగ్రెస్
👉ముఖ్యమంత్రి మాట్లాడే భాషను కట్టడి చేయాలని సీఈఓను కోరిన నాయకులు
👉ముఖ్యమంత్రి పదవిలో ఉండి భాద్యతగా ఉండాలని సూచన

నర్సాపూర్ సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్‌ల కలకలం..

👉సభ ప్రగణంలోకి వచ్చిన అస్లం అనే వ్యక్తి నుంచి రెండు బుల్లెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
👉సంగారెడ్డి జిల్లా రాయికోడ్  చెందిన అస్లం అనే యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు.

కూకట్ పల్లి రోడ్ షోలో కేటీఆర్
👉ఆరున్నర సంవత్సరాల పని తీరు మీ ముందుంది
👉హైదరబాద్‌లో స్థిరబడిన అందర్నీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాం అని కేసీఆర్ చెప్పారు.
👉ఏ రాష్ట్రం అయిన మేము కాపాడుకున్నాం.
👉పెట్టుబడులు ఆకర్షిస్తు హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతుంది.
👉చెన్నై నుంచి వచ్చిన రజినీకి హైదరాబాద్ అభివృద్ది కనిపిస్తుంది కానీ, ప్రతిపక్ష గజినిలకు కనపడడం లేదు.
👉కూకట్ పల్లి లో అభివృద్ది చేసి చూపించాం.
👉ఇక్కడి నుంచి ఎక్కడి వెళ్ళలన్నా ఫ్లై ఓవర్‌లు, అండర్ పాస్‌లు రోడ్ల విస్తరణతో ప్రయాణం సులువు అయ్యింది.
👉హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ది చెందింది.
👉మాధవరం కృష్ణ రావును గెలిపించాలి. కేసిఆర్‌ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి.
👉మేం అధికారంలోకి గ్యాస్ సిలెండర్ ధర 400 కే ఇస్తాం.
👉పని చేసే ప్రభుత్వాన్ని పట్టించుకోకపొతే మళ్ళీ ఇబ్బంది పడతాం.
👉హైదరాబాద్ బాగుండాలంటే కేసీఆర్ రావాలి. లేదంటే కుక్కలు చింపిన విస్తరి అవుతుంది.
👉ఆరు గ్యారంటీలంటే హైదరాబాద్ అగమవటం రాజకీయ అస్థిరత, ఆరునెలలకో సీఎం రావటం, మళ్ళీ కరెంట్ కష్టాలు రావటం మాత్రం గ్యారంటీ
 

నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్‌ రావు
👉తెలంగాణ మేమే ఇచ్చినం అని చిదంబరం అంటున్నారు.
👉తెలంగాణ ప్రజలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నారు
👉పోరాటం చేస్తే, కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తే తెలంగాణ వచ్చింది.
👉బ్రిటీష్ వాళ్లు దేశానికి స్వాతంత్య్రం ఇచ్చారు అంటామా?
👉దేశ ప్రజలు పోరాటం చేసి, బ్రిటీష్ వారి మెడలు వంచి సాధించారు.
👉అలాగే తెలంగాణలో 14 ఏళ్లు కేసీఆర్ సారథ్యంలో ఉద్యమం చేసి తెలంగాణ సాధించాం.
👉కాంగ్రెస్ ముందే తెలంగాణ ఇచ్చి ఉంటే వందల మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడుకునే వాళ్ళం.
👉వందల మందిని పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ.
👉రేవంత్ రెడ్డి సోనియాను బలి దేవత అన్నాడు. కుర్చీ కోసం మాట మార్చాడు.
👉బీజేపీ వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని తిరుగుతున్నారు.
👉బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను నమ్మవద్దు. మోసపోవద్దు.

👉ధరణి వద్దు అన్నవాళ్ళను బంగాళాఖాతంలో కలపాలి
👉రైతు బంధు ఎందుకు అన్నవాళ్లను బొంద పెట్టాలి.
👉కరెంట్ ఎందుకు అన్నొడిని పొలిమేర దాకా తరిమి కొట్టాలి.
👉కాంగ్రెస్ ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్ చేసింది.
👉10 హెచ్ పీ మోటార్లు ఎవరు ఇస్తారు. మూడు గంటల కరెంట్ ఎలా చాలుతుంది.

👉కర్ణాటకలో అనేక కరెంట్ కష్టాలు ఉన్నాయి. 
👉ప్రతిపక్షాలకు ఎజెండా లేక బూతులు మాట్లాడుతున్నారు.
👉తెలంగాణకు దశ, దిశ అందించే నాయకులు కావాలి. బూతులు మాట్లాడే నాయకులు మనకు ఎందుకు?
👉అన్నీ వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటున్నారు. 
👉సాగు నీళ్ళు వచ్చాయి. రెండు పంటలు పండుతున్నాయి. కాంటాలు పెట్టీ ప్రతి గింజ కొనుగోలు చేస్తున్నారు.
👉9 ఏళ్ల సీఎం కేసీఆర్ పాలనలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు.
👉గత ప్రభుత్వాలు రైతు నుంచి డబ్బులు వసూలు చేస్తే, కేసీఆర్ రైతు బంధు ద్వారా రైతులకు ఇస్తున్నారు.
👉రైతు బంధు, వ్యవసాయాన్ని అవమానించిన రేవంత్ రెడ్డికి ఓటుతో బుద్ది చెప్పాలి.
👉మిగిలిన రుణమాఫీని పూర్తి చేస్తాం. ఇప్పటికే ఎన్నికల కమిషన్ అనుమతి కోరాం. అనుమతి వస్తే వారంలో పూర్తి చేస్తాం.
👉లేదంటే వచ్చేది మన ప్రభుత్వం. డిసెంబర్ 3 తర్వాత చేసుకుందాం.
👉మంచి మానిఫెస్టో సీఎం కేసీఆర్ రూపొందించారు. ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి.
👉కర్ణాటక ప్రజలు ఎందుకు కాంగ్రెస్‌కు ఓటు వేశాం అని బాధపడుతున్నారు.
👉నర్సాపూర్ అంటే గులాబీ జెండా అడ్డ. సునితమ్మను మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉంది.

ఆయన వస్తే  గెలుపు తథ్యం: మంత్రి పువ్వాడ అజయ్
👉 2018లో ఇదే నెలలో ఈ ప్రాంతంలో మైనార్టీ సభ పెట్టారు. అది నాకు సెంటిమెంట్ సభ.
👉కార్పొరేషన్ ఎన్నికల్లో హోం మంత్రి మహమూద్ అలీ వచ్చి ప్రచారం చేస్తే 16కు 16 సీట్లు గెలుచుకున్నాం
👉ఆయన వస్తే గెలుపు తథ్యం.
👉తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి డిప్యూటీ సీఎం పదవి ముస్లింలకు సీఎం కేసీఆర్ కేటాయించారు.
👉దీన్ని బట్టి ఆయనకు మైనార్టీల పట్ల ఉన్న నిబద్దత అర్థమవుతోంది.
👉హోం మంత్రి మహమూద్ అలీ స్థానం కేసీఆర్‌ గుండెల్లో పదిలం.
👉హోం మంత్రి నన్ను ఎప్పుడు తమ్ముడు అని సంబోధిస్తారు.
👉ఈ అజయ్ అన్న మీ బిడ్డ. ఇక్కడే పుట్టాను. ఇక్కడే చదువుకున్నాను.
👉ఇక్కడి ప్రజలంతా నా బంధువులు, నేను మీ బిడ్డను, మీ అన్నను, మీ తమ్ముడిని.
👉నేను ఇక్కడే ఉండే లోకల్ వ్యక్తిని, ఆయన ఇక్కడ ఉండడు 
👉అవతలి వ్యక్తి ఎన్టీఆర్ ను మోసం చేసి చంద్రబాబు పంచన చేరాడు
👉 చంద్రబాబును మోసం చేసి కేసీఆర్ దగ్గరకు వెళ్ళారు. ఆయనను ఆదరించి మంత్రి పదవి ఇచ్చారు కేసీఆర్‌.
👉ఆయన ఖమ్మం ప్రజలకు చేసింది ఏం లేదు
👉కొంతమందిని ప్యాకేజీ  ఇచ్చి తీసుకుని పోతున్నారు. నేను ప్రజలను నమ్ముకుని ఉన్నా వారే నాకు అండగా ఉంటారు

తెలంగాణలో ఇంకా పూర్తికాని గుర్తుల కేటాయింపులు
👉స్వతంత్ర అభ్యర్థులకు, నాన్‌ రిజిస్ట్రేషన్‌ పార్టీలకు గుర్తులు కేటాయించడంలో ఆలస్యం
👉నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసి 24 గంటలు అవుతున్నా.. ఇంకా పూర్తికాని అభ్యర్థుల గుర్తుల కేటాయింపులు
👉తెలంగాణ వ్యాప్తంగా వెయ్యికిపైగా ఇండిపెండెంట్‌ అభ్యర్థులు
👉నామినేషన్లు ముగిసినా అభ్యర్థుల పేరుమీద రాని గెజిట్‌
👉ROల నుంచి సరైన సమాయానికి రాని పూర్తిస్థాయి రిపోర్టు

వికారాబాద్‌లో కేటీఆర్‌ రోడ్‌ షో
👉రాష్ట్రంలో మంచినీటి సమస్య తీరింది
👉ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు అందిస్తున్నాం
👉పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేకుట్ర
👉కాంగ్రస్‌ ఒక్క ఛాన్స్‌ ఇవ్వమంటుంది
👉11 ఛాన్స్‌లు ఇస్తే ఏం చేసింది?

రైతుబంధు ఉండాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలవాలి
👉 నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌
👉 రైతు బంధు పథకాన్ని కలలో కూడా ఎవరూ ఊహించలేదు.
👉మొట్ట‌మొద‌టిసారి రైతుబంధును పుట్టించిందే బీఆర్‌ఎస్‌.
👉 ఈ ప‌థ‌కం కింద పెట్టుబ‌డి సాయం అందుతుంది.
👉దురదృష్టవశాత్తు రైతు చనిపోతే వారం రోజుల్లోనే రూ. 5 లక్షల బీమా అందిస్తున్నాం.

అవినీతి కమీషన్ల కోసమే మేడిగడ్డ ప్రాజెక్ట్: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
👉నేను హౌసింగ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు లక్షల ఇల్లు కట్టిస్తే కేసీఆర్ అగ్గిపెట్టె ఇల్లు కట్టించారు.
👉రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన అందరికీ వంద గజాల ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు.
👉మన పిల్లల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి.
👉నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తాం.
👉ఇంటికో ఉద్యోగం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఊరికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు.
👉డిసెంబర్ నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం

తెలంగాణ అసెంబ్లీ బరిలో 2290 మంది..

👉తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 నియోజకవర్గాలకు గానూ 2290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
👉అత్యధికంగా ఎల్బీ నగర్‌లో 48 మంది పోటీ.
👉అత్యల్పంగా నారాయణపేట్‌ నియోజకవర్గం బరిలో ఏడుగురు అభ్యర్థులు.

👉సంగారెడ్డి: సీపీఎం జిల్లా కార్యాలయనికి వెళ్లిన మంత్రి హరీష్ రావు.
👉ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలని జిల్లా కార్యదర్శి మల్లేశంను కోరిన మంత్రి హరీష్ రావు.
👉సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లెపల్లిలోని సంగారెడ్డి బీజేపీ ఇంచార్జి రాజీవ్ దేశ్ పాండే ఇంటికి చేరుకున్న మంత్రి హరీష్ రావు.
👉సంగారెడ్డి బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన దేశ్ పాండే
👉బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న దేశ్‌ పాండేను బీఆర్‌ఎస్‌లోకి రావాలని ఆహ్వానించిన మంత్రి హరీష్.
👉నర్సాపూర్ ప్రజా ఆశీర్వద సభలో సీఎం కేసీఆర్  సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్న దేశ్ పాండే
👉సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు జీ జడ్పీటీసీ గడిలా శ్రీకాంత్ గౌడ్ బీజేపీ పార్టీకి రాజీనామా

కాంగ్రెస్ నేత చిదంబరానికి మంత్రి హరీష్‌ రావు కౌంటర్‌
👉చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపిన‌ట్టుగా ఉంది.
👉తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగానే కదా ఉద్యమంలో యువకులు బలిదానం చేసింది. 
👉 పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. 
👉పొట్టి శ్రీరాములు ఆంధ్రా రాష్ట్రం గురించి ఉద్యమించినపుడు కేంద్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ?
👉 అప్పటి నెహ్రు ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయింది?
👉 చరిత్ర తెలియనిది కేసీఆర్‌కు కాదు.. చిదంబరమే చరిత్ర తెలియకుండా వ‌క్ర భాష్యాలు చెబుతున్నారు.
👉అప్ప‌ట్లో మద్రాసు రాష్ట్రం ఉండేద‌ని, తెలంగాణ రాష్ట్రం లేకుండే అని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదం. 
👉హైదరాబాద్  అనేది ఓ రాష్ట్రంగా ఉండేద‌నే  విషయాన్ని ఆయ‌న మరిచిపోతున్నారు.  
-ట్విట్టర్‌లో మంత్రి హరీష్ రావు

సీఎం కేసీఆర్‌ ప్రజలను మభ్యపెడుతున్నారు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌
►బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటేయాలి?
►10 జిల్లాలను 33 చేశారు.
►కొత్త వ్యవస్థకు సరిపడా ఉద్యోగాలు భర్తీ చేయలేదు.
►నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు.
►ఉద్యోగాలను కేసీఆర్‌ ప్రభుత్వం దొంగతనంగా అమ్ముకుంటోంది.
►కొలువులు రావాలంటే కేసీఆర్‌ ప్రభుత్వం పోవాలి.

ఆదిలాబాద్ సభలో సీఎం కేసీఆర్
► గోండిలో అందరికి రాం రాం చెప్పిన కేసీఆర్
►దేశంలో ప్రజాస్వామ్య పరిణితి రాలేదు.
► ఓటు ఆయుధం. దీనిని జాగ్రత్తగా వాడాలి
►అభ్యర్థులను అలోచించి ఓటు వేయాలి. ఆ పార్టీ  చరిత్రను  చూడాలి.
►ఎన్నికలలో ప్రజల  గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం
►దేశంలో ఏ రాష్ట్రంలో  లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము
►ఇరవై  నాలుగు గంటలు  కరెంట్  ఇస్తున్నాము
►రైతు  బంధు ఇస్తున్నాము. రైతు బాధ నాకు తెలుసు
►ధరణితో  ప్రజలకు  అధికారం ఇచ్చాము.
►మీభూమి హక్కును మార్చే శక్తి ‌ముఖ్యమంత్రికి  కూడా లేదు.
►మీ బోటనవేలు ముద్ర పడితేభూమి మారుతుంది
►ధరిణితో రైతు బంధు  ఇస్తున్నాము.

►ధరణి తీసేస్తే  రైతు బంధు ఎలా వస్తుంది.
►ధరణి తీసేస్తే లంచాల రాజ్యం వస్తుంది.  
►టీపీసీసీ  అధ్యక్షుడు రేవంత్  రెడ్డి మూడు గంటలు కరెంట్‌ ఇస్తామంటున్నారు.
►చావు నోట్ల తలపెట్టి తెలంగాణ తెచ్చిన.
► కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా? అని  గ్రామాల్లో  చర్చించాలి.
►జోగురామన్న. సామాన్యమైన  వ్యక్తి.
►అతన్ని మంచి మెజారీటీతో  గెలిపించాలి.
►కేంద్ర ఒక్క మెడికల్ కళాశాల, నవోదయ కళాశాల ఇవ్వలేదు
►బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయకూడదు.

సమర్థ పాలన కేవలం బీజేపీతోనే సాధ్యం..
👉పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురంలో బీజేపీ బహిరంగ సభ.
👉 హాజరైన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.
👉పైసలిచ్చి మహిపాల్ రెడ్డి టికెట్ తెచ్చుకున్నారు: బండి సంజయ్.
👉 మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రోరైలు విస్తరణకు కృషి చేస్తాం.
👉 ప్రధాని మోదీ ఇచ్చే పైసలతో డబుల్ బెడ్ రూం, ఆసుపత్రులు కట్టారు
👉 నీళ్లు, నిధులు, నియమకాలు పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆయనకు మాత్రమే తప్ప ఎవరికీ ఉద్యోగాలు రాలేదు.
👉బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందు దొందే. ఈ పార్టీలు ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
👉 కేసీఆర్, కాంగ్రెస్ పార్టీలు కూర్చుని ఆరు గ్యారంటీ పథకాలు సృష్టించారు.
👉 సమర్థ పాలన కేవలం బీజేపీతోనే సాధ్యం.
👉 కాంగ్రెస్, బీబఆర్ఎస్ పార్టీలు అధికారంలోకి వస్తే తెలంగాణ మరో శ్రీలంక అవుతుంది.
👉 పోడు భూముల కోసం, నిరుద్యోగుల కోసం కొట్లాడితే మాపై కేసులు పెట్టారు.
👉 కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరికోసమైనా కొట్లాడి జైలుకు పోయారా?
👉 బీజే ముఖ్యమంత్రి డిక్లరేషన్ చేసి బీజేపీ సంచనం సృష్టించింది.
👉 తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ గెలవాలి.
👉 కేసీఆర్ దారుసలాంకు సలాం చేయడు దారుకే సలాం చేస్తాడు.
👉 మైనారిటీలను కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేశాయి. ఓటు బ్యాంకుగానే వారిని చూస్తున్నారు.

బీఆర్‌ఎస్‌కు భవిష్యత్‌ లేదు: భట్టి విక్రమార్క
►సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మంలో ఎన్నికల ప్రచారం
►బీఆర్ఎస్ పార్టీ నుండి మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక.
►మధిర మండలం రామచంద్రపురంలో భట్టి కామెంట్స్
►కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం ఏర్పాటైనా 100 రోజుల్లో అమలు చేస్తాం.
►బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదు.
►నవంబర్‌ 30 తరువాత రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఉండదు.
►పది సంవత్సరాలు రాష్ట్ర సంపదను దోచుకున్నారు. 
►బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు వదిలించుకోవాలనుకుంటున్నారు.
►కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకరావాలని ప్రజలు సునామీలా ప్రభంజనం సృష్టించబోతున్నారు.
►డిప్యూటీ స్పీకర్ హయాంలో నియోజకవర్గంలో నిధులు వరదలా పారించాం.
►జాలిముడి ప్రాజెక్టును నిర్మిచాం.
►బీఆర్ఎస్ పార్టీ నుండి మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక.

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు ఊరట
►తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. 
►ప్రవీణ్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేయవద్దంటూ కోర్టు ఆదేశిచ్చింది. 
►సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన ప్రవీణ్‌ కుమార్‌
►సిర్పూర్‌లో కొంత మందిపై ప్రవీణ్‌ కుమార్‌ దాడి చేశారని, డబ్బులు తీసుకున్నారని ఆయనపై కేసు నమోదు. 
►దీంతో, హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసిన ప్రవీణ్‌ కుమార్‌
►విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు. 
►తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అరెస్ట్‌ చేయవద్దని కోర్టు ఆదేశం. 

కాంగ్రెస్‌ మేనిఫెస్టో రెడీ!..
►కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు.
►ధరణి స్థానంలో భూ భారతి పేరుతో అప్‌గ్రేడ్‌ యాప్‌. 
►గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం. 
►రేషన్‌ డీలర్లకు గౌరవ వేతనంతో పాటుగా కమీషన్‌. 
►అభయ హస్తం పథకం తిరిగి పునద్దరణ.
►ఆర్‌ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు కార్డులు. 
►అమ్మహస్తం పేరుతో 9 నిత్యవసర వస్తువుల పంపిణీ. 
►ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్‌. 

తెలంగాణ ఎన్నికల బరిలో 2290 మంది అభ్యర్థులు..
►రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకుగానూ 2290 మంది అభ్యర్థులు. 
►గజ్వేల్‌ బరిలో 44 మంది అభ్యర్థులు. 
►గజ్వేల్ 114 అభ్యర్థులు కాగా 70 మంది ఉపసంహరణ
►మేడ్చల్‌లో 67 అభ్యర్థులకు గాను 45 మంది ఉపసంహరణ, పోటీలో ఉన్న అభ్యర్థులు 22 మంది. 
►ఎల్బీ నగర్‌లో 48, 
►సిరిసిల్ల, సిద్దిపేటలో 21, 
►కామారెడ్డిలో 39, 
►నాంపల్లి 34, 
►మల్కాజిగిరి 33, 
►షేర్ లింగంపల్లి 31 అభ్యర్థులు.

జగిత్యాల జిల్లా:
కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కవిత ప్రచారం
మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కోసం రోడ్ షో లో పాల్గొన్న కవిత.

తెలంగాణలో స్పీడ్‌ పెంచిన ఈసీ..
►తెలంగాణలో పోలీంగ్‌కు ఈసీ స్పీడ్‌ పెంచింది. 
►కాసేపట్లో ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌. 
►వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న సీఈవో వికాస్‌రాజ్‌ బృందం. 

రేవంత్‌ వ్యాఖ్యలు సరైనవి కావు: మహమూద్‌ అలీ
►ఖమ్మంలో ప్రచారంలో పాల్గొన్న హోం మంత్రి మహమూద్‌ అలీ.
►కాంగ్రెస్‌లో 20 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. 
►బీఆర్ఎస్‌లో సీఎం కేసీఆర్ మాత్రమే.
►రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌వాది తరువాతే కాంగ్రెస్‌వాది. 
►రేవంత్ వ్యాఖ్యలు సరైనవి కావు
►గాంధీ స్వాతంత్ర్యం కోసం పోరాడాడు.
►ఫరూఖ్ అజూల్లా న్యాయం కోసం పోరాడిన నాయకుడు
►తెలంగాణ గాంధీ కేసీఆర్
►మీడియాలో నా వ్యాఖ్యలను వక్రీకరించారు
►ఎవరైనా నా వ్యాఖ్యలకు బాధపడితే క్షమించాలి.
►పువ్వాడ అజయ్‌ను మళ్లీ గెలిపించాలి.
►గతంలో ఉన్న ఖమ్మం ఇప్పుడున్న ఖమ్మంను చూసి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి. 


బీఆర్‌ఎస్‌ సభకు అనుమతి..
►పరేడ్‌ గ్రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ సభకు అనుమతి లభించింది. 
►ఈనెల 25న పరేడ్‌ గ్రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ సభ. 
►భారీగా జన సమీకరణను బీఆర్‌ఎస్‌ కసరత్తు.
►సభలో పాల్గొననున్న సీఎం కేసీఆర్‌.

ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లోకి విజయశాంతి..
►సీనియర్‌ నేత విజయశాంతి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. 
►రేపు తెలంగాణకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.
►ఖర్గే సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. 
►బుధవారం బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి.
►రాజీనామా లేఖను కిషన్‌రెడ్డికి పంపిన విజయశాంతి. 
►ఆమె రాజీనామా లేఖపై ఇంకా స్పందించని బీజేపీ.  

ఐటీ సోదాలపై భాస్కర రావు సీరియస్‌ కామెంట్స్‌..
►మిర్యాలగూడలో ఐటీ సోదాలపై స్పందించిన భాస్కర రావు
►ఎక్కడో వ్యాపారస్తుల మీద రైడ్ జరిగితే నాకేం సంబంధం
►నా బంధువులపై, నా కుమారుల ఇంట్లో సోదాలు జరగట్లేదు.
►నాపైన ఐటీ సోదాలు జరిగితే నేనెందుకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాను
►నాకు పవర్ ప్లాంట్స్‌ ఉన్నాయి అన్నది అపోహ మాత్రమే..
►నాపైన ఐటీ సోదాలు జరుగుతున్నాయన్న ప్రచారాన్ని నమ్మకండి.
►నేను ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాను. 

నల్లగొండ జిల్లా:
నల్లగొండ పట్టణంలోని 38వ వార్డులో కొనసాగుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సబిత  ఎన్నికల ప్రచారం

నల్గొండ జిల్లా:
మునుగోడు పట్టణ కేంద్రంలో గడపగడపకు ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.
బీఆర్ఎస్ మేనిఫెస్టోను వివరిస్తూ ఓటును అభ్యర్థిస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.

మెదక్ జిల్లా:
నర్సాపూర్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న పీసీసీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్

గాలి అనిల్ కుమార్ ఇంటికి మంత్రి హరీష్‌
సంగారెడ్డి జిల్లా;
అమిన్ పూర్ లోని పీసీసీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ ఇంటికి చేరుకున్న మంత్రి హరీష్‌రావు
గాలి అనిల్ కుమార్‌ని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి హరీష్

కేసీఆర్‌ కొత్త టెన్షన్‌.. గెలుపుపై ఎఫెక్ట్‌?
►తెలంగాణలో బుధవారంతో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
►బరిలో నిలిచే అభ్యర్థులను ఫైనల్ చేసిన ఎలక్షన్ కమిషన్
►సీఎం కేసీఆర్ బరిలో ఉన్న గజ్వేల్, కామారెడ్డిలో అత్యధిక అభ్యర్థులు
►గజ్వేల్-44, కామారెడ్డి-39 మంది అభ్యర్థులు
►నిన్న సాయంత్రం మూడు గంటలకు ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
►ఇప్పటికీ అధికారిక ప్రకటన చేయని ఎలక్షన్ కమిషన్
►స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంలో ఆలస్యం అవుతుందన్న ఈసీ
►ఈరోజు పూర్తిస్థాయి ప్రకటన చేస్తామన్న ఎలక్షన్ కమిషన్
►అత్యాల్పంగా నారాయణపేటలో 10మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో
►GHMC పరిధిలోని 15 సెగ్మెంట్లలో 312 మంది అభ్యర్థులు
►నిన్న 15 నియోజకవర్గాల్లో కలిపి ఉపసంహరణ చేసుకున్న 20మంది అభ్యర్థులు
►హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా నాంపల్లి సెగ్మెంట్ బరిలో 34 మంది అభ్యర్థులు
►ముషీరాబాద్ 31, మలక్ పేట్, యాకుత పురాలో 27మంది అభ్యర్థులు
►ఖైరతాబాద్ 25, సికింద్రాబాద్ బరిలో 24మంది అభ్యర్థులు
►అత్యల్పంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బరిలో 10మంది అభ్యర్థులు.

తెలంగాణలో మళ్లీ మొదలైన ఐటీ సోదాలు
►తెలంగాణలో ఎన్నికల వేళ ఐటీ సోదాలు కలకలం.
►మిర్యాలగూడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు ఇంటిపై ఐటీ దాడులు. 
►మొత్తం 40 బృందాలతో ఐటీ అధికారుల దాడులు
►ఎన్నికల కోసం భారీగా డబ్బు నిల్వ చేసినట్టు ఆరోపణలు
►హైదరాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో ఐటీ తనిఖీలు. 
►ఒక్క నల్గొండలోనే 30 బృందాలతో సోదాలు చేస్తున్న ఐటీ. 
►ప్రస్తుతానికి మిర్యాలగూడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నల్లమోతు భాస్కరరావు
►ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బులు  నిల్వ చేసినట్లుగా ఆరోపణలు.
►నల్లమోతు భాస్కరరావుకి దేశవ్యాప్తంగా వ్యాపారాలు
►పలు పవర్ ప్లాంట్లలో పెట్టుబడి పెట్టిన భాస్కరరావు.
►భాస్కరరావు, ఆయన బావమరిది శ్రీధర్‌తో పాటు మరొక నాలుగు చోట్ల మిర్యాలగూడలో జరుగుతున్న సోదాలు

రేపు తెలంగాణలో ఖర్గే, రాహుల్ పర్యటన..
►పినపాక, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, రాజేందర్ నగర్‌లలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం.
►రేపు మధ్యాహ్నం టీకాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే
►సాయంత్రం కుత్బుల్లాపూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఖర్గే

నేడు మేడ్చల్‌లో రేవంత్‌ ప్రచారం..
►నేడు మేడ్చల్ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
►జవహర్ నగర్, మేడ్చల్ ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్స్‌లో పాల్గొననున్న రేవంత్
►ఉదయం 11 గంటలకు జవహర్ నగర్, మధ్యాహ్నం 12 గంటలకు కార్నర్ మీటింగ్స్‌లో పాల్గొననున్న రేవంత్

నేడు నాలుగు నియోజకవర్గాల్లో కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం
►ఆదిలాబాద్‌, బోథ్‌, నిజామాబాద్‌, నర్సాపూర్‌లో సభలు. 
►నిజామాబాద్ రూరల్ నియోజక వర్గం డిచ్ పల్లిలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన
►ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్న సీఎం కేసీఆర్, బాజిరెడ్డి గోవర్దన్
►ఈ పర్యటనతో జిల్లాలో ముగుస్తున్న కేసీఆర్ సభలు
►కామారెడ్డిపై దృష్టి సారించనున్న కేసీఆర్సీఎం కేసీఆర్‌ నేడు ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. 
►ఆదిలాబాద్‌ నిర్వహించే బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌ పాల్గొంటారు. 

నేడు కోరుట్లలో ఎమ్మెల్సీ కవిత ప్రచారం
►ఎమ్మెల్సీ కవిత నేడు కోరుట్లలో ఎ‍న్నికల ప్రచారం చేయనున్నారు. 
►కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్, సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి ప్రచారం..
►బండలింగాపూర్, వెల్లుల్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల మండలం ఐలాపూర్‌లో సాయంత్రం వరకు ప్రచారంలో పాల్గొననున్న కవిత.

మరిన్ని వార్తలు