థాక్రే వర్గానికి పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఫైనల్ చేసిన ఈసీ.. షిండేకు షాక్‌!

10 Oct, 2022 21:13 IST|Sakshi

సాక్షి,న్యుఢిల్లీ: అంధేరీ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి పార్టీ పేరు, ఎన్నికల గుర్తును  కేటాయించింది ఎన్నికల సంఘం.  శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) పేరు, కాగడా(ఫ్లేమింగ్ టార్చ్‌) గుర్తును ఖరారు చేసింది.

మరోవైపు ఏక్‌నాథ్ షిండే వర్గానికి 'బాలసాహెబ్‌చీ శివసేన' పేరును ఫైనల్‌ చేసింది ఈసీ. అయితే ఎన్నికల గుర్తు మాత్రం ఖరారు చేయలేదు. షిండే వర్గం అడిగిన గుర్తులు ఇప్పటికే రిజిస్టర్ అయ్యాయని, కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించింది.

అయితే థాక్రే, షిండే అడిగిన త్రిశూలం, గధ, ఉదయించే సూర్యుడి గుర్తులను కేటాయించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. కొన్ని గుర్తులు మతపరంగా ఉన్నాయని, ఉదయించే సుర్యూడి గుర్తు డీఎంకే రిజిస్టర్ చేసుకుందని పేర్కొంది.

అసలైన శివసేన తమదంటే తమదే అని థాక్రే, షిండే వర్గం వాదిస్తున్న నేపథ్యంలో శివసేన పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును ఈసీ సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నవంబర్ 3న జరిగే అంధేరీ ఉపఎన్నిక కోసం పార్టీ పేరు, గుర్తు కోసం రెండు వార్గాలు కొన్ని ప్రతిపాదనలను ఈసీకి పంపాయి.
చదవండి: నన్ను గెలిపిస్తే రూ.20కే పెట్రోల్‌, ఇంటికో బైక్‌..

మరిన్ని వార్తలు