అందుకే ప్రచారానికి దూరం: రాజాసింగ్‌

24 Nov, 2020 16:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో జీహెచ్‌ఎంసీ‌ ఎన్నికల వార్‌ జోరుగా నడుస్తోంది. పార్టీలన్ని ఒకదానిపై మరొకటి తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాయి. దుబ్బాక విజయంతో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా దూసుకెళ్తుంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి, ప్రతిపక్ష ఎంఐఎం, కాంగ్రెస్‌ పార్టీలకి స్ట్రాంగ్‌ కౌంటర్‌లు ఇస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు చేశారు. ‘బీజేపీ వాళ్లు ఫ్రస్టేషన్‌లో ఉన్నారు.. వాళ్ళకు బిర్యానీ తినిపించాలి అని అసుదుద్దీన్ అంటున్నారు. ఎన్నికల సమయంలో హిందూ ముస్లిం సింపతి తీసుకుని రావాలని అసద్ చూస్తున్నారు. కానీ బీజేపీ ఎప్పుడూ ఆయనలాగ తప్పుడు ప్రచారం.. కామెంట్స్ చేయదు. వాల్మీకి కులాల వారు ‘పిగ్ బిర్యానీ’ బాగా చేస్తారు... అసదుద్దీన్‌.. నీకే మంచి బిర్యానీ తినిపిస్తా రా’ అంటూ రాజా సింగ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ( గ్రేటర్‌ వార్‌: సందిగ్ధతకు తెర దించిన ఒవైసీ..)

అందుకే ప్రచారానికి దూరం: రాజాసింగ్‌
రాజా సింగ్‌ మాట్లాడుతూ.. ‘వరదల తరువాత ఒక్క ముస్లిం కూడా అసదుద్దీన్‌ ఓవైసీకి ఓటెయ్యరు. ఓల్డ్ సిటీలో అనేక బస్తిలు మునిగిపోయాయి.. ఇల్లుమునిగాయి.. పడిపోయాయి.. బైక్‌లు కొట్టుకు పోయాయి. నీవు కానీ నీ పార్టీ కాని వారికి సాయం చేయలేదు. ఓల్డ్‌ సిటీ ఓటర్లు నీ పార్టీని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ముస్లిం ఏరియలో డెవలప్‌మెంట్.. న్యాయం కావాలంటే ఒకే ఒక్క ఆప్షన్.. బీజేపీ అధికారంలోకి రావడం మాత్రమే. వరదసాయం పూర్తిగా బాదితులకు చేరలేదు. అవి టీఆర్ఎస్.. ఎంఐఎం కార్యకర్తల జేబుల్లోకి వెళ్ళాయి. నా అల్లుడు చనిపోయినందుకు నేను ప్రచారంలో పాల్గొనడం లేదు’ అని తెలిపారు రాజా సింగ్.‌

మరిన్ని వార్తలు