-

Etela Rajender: నేను గెలిస్తే కేసీఆర్‌ రోడ్డుమీదకు..: ఈటల

2 Oct, 2021 08:42 IST|Sakshi
Huzurabad Bypoll: ఇల్లందకుంట సభలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

ఇల్లందకుంట (హుజూరాబాద్‌): హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తాను గెలిస్తే తెలంగాణ ముఖచిత్రం మారుతుందని, ఫౌంహౌస్‌లో ఉన్న కేసీఆర్‌ రోడ్డు మీదకు వస్తారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం నాగారం, నగురం, వావిలాల, పాపక్కపల్లి, గోపాల్‌పూర్‌లలో శుక్రవారం ఆయన ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు.
చదవండి: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు

ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ‘నాది రేశంగల పుట్టుక. దళితబంధు వద్దు అని నేను, కాళ్లు మొక్కుతా బాంఛన్‌ అని లేఖ రాస్తానా? టీఆర్‌ఎస్‌ పార్టీ ఆదేశాల మేరకు కొంతమంది ఫేక్‌గాళ్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కేసీఆర్‌కు జాతి, నీతి, మానవత్వం లేదు. 2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరడం ఖాయం’అని అన్నారు. కేసీఆర్‌ ధర్మంతో ఆడుకుంటున్నారని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జోస్యం చెప్పారు.

ప్రజలకు ఏ పథకం కావాలన్నా ఇంటి మీద టీఆర్‌ఎస్‌ జెండా ఉండాలని బెదిరింపులకు గురిచేస్తున్నారని, మద్యం ద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లు వస్తున్నాయని, కానీ పెన్షన్ల మీద ఖర్చు పెట్టేది కేవలం రూ.9 వేల కోట్లు మాత్రమే అని పేర్కొన్నారు.  అనంతరం పలు గ్రామాలకు చెందిన నాయకులు ఈటల రాజేందర్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. 

మరిన్ని వార్తలు