పప్పు.. తుప్పు ఇద్దరూ ఇంటికే పరిమితమయ్యారు: కొడాలి నాని

19 Jun, 2021 11:38 IST|Sakshi
మంత్రి కొడాలి నాని

సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్‌ పిచ్చికుక్కలా అరుస్తున్నాడని, పప్పు.. తుప్పు ఇద్దరూ ఇంటికే పరిమితమయ్యారని మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తండ్రి కోడుకులిద్దరూ ఇంట్లో కూర్చుని జూమ్‌లో కాలక్షేపం చేస్తున్నారని, చంద్రబాబు పెట్టిన బకాయిలు తమ ప్రభుత్వం చెల్లించిందని మండిపడ్డారు. రైతులకు బాబు పెట్టిన రూ. 4వేల కోట్లు బకాయిలు చెల్లించామని, రైతులకు పంగనామాలు పెట్టి పారిపోయిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు బాంధవుడని కొడాలి కొనియాడారు. 21 రోజుల్లోపు ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రైతులకు చెల్లిస్తున్నామని తెలిపారు.

కేంద్రానికి లేఖ రాయాలంటే చంద్రబాబుకు భయమని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఊక, ధాన్యానికి తేడా తెలియని వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. లోకేష్‌ను అచ్చోసిన ఆంబోతులా వదిలారని, చంద్రబాబు, లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబేనని, రాష్ట్రంలోకి సీబీఐ రాకూడదని చట్టం తెచ్చిన వ్యక్తి బాబు అని ఫైర్‌ అయ్యారు. టీడీపీ హయాంలో వైఎస్సార్‌సీపీ నేతల హత్యలు జరిగాయని, గ్రామాల్లో ఘటనలను తమపై ఆపాదించడం సమంజసమా అని మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. శత్రువులతో కూడా శభాష్ అనిపించుకునే వ్యక్తి సీఎం జగన్ అని ఆయన అన్నారు.

చదవండి: ‘లోకేష్‌ బఫూన్‌కు తక్కువ.. జోకర్‌కు ఎక్కువ’

మరిన్ని వార్తలు