తెలంగాణలో వచ్చేది హంగ్‌ అసెంబ్లీనే.. కేసీఆర్‌కు సీన్‌ అర్థమైంది అందుకే ఇలా!: ఎంపీ కోమటిరెడ్డి

14 Feb, 2023 12:28 IST|Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణలో పొత్తులపై కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వచ్చేది హంగ్‌ అంసెబ్లీనేనని అన్నారు. ఎన్నికల ఫలితాల్లో.. ఏ  పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌లు కలవక తప్పదని పేర్కొన్నారాయన.

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60 సీట్లు రావని అన్నారు. అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్‌ మరో పార్టీతో కలవాల్సిందేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ సెక్యులర్‌ పార్టీలని, కాంగ్రెస్‌తో కేసీఆర్‌ కలవక తప్పదని తెలిపారు. అందుకే కేసీఆర్‌ కాంగ్రెస్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని ప్రస్తావించారు.

కాంగ్రెస్‌లో వివిధ కారణాల వల్ల సీనియర్‌ నేతలు ఓకే వేదికపైకి రాలేకపోతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ ఒంటరిగా అధికారంలోకి రాలేదని జోస్యం చెప్పారు. తమ పార్టీ నేతలంతా కలిసి కష్టపడితే 40 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్చి 1 నుంచి పాదయాత్ర, బైక్‌ యాత్రం చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు.  కొత్తయినా, పాతయినా గెలిచేవాళ్లకే సీట్లు ఇవ్వాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడతానని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత పొత్తులు తప్పవని అన్నారు. 
చదవండి: Revanth Reddy: ఏ సెంటర్‌కైనా రెడీ! కాళ్లూ చేతులు ఎలా విరుస్తావో చూస్తా..

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు