Adani Group crisis: రూ.10 లక్షల కోట్లు హాంఫట్‌, 24వ స్థానానికి గౌతం అదానీ

14 Feb, 2023 12:22 IST|Sakshi

సాక్షి, ముంబై: అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌  ప్రకంపనలతో అదానీ గ్రూపు ఇన్వెస్టర్లసంపద రోజురోజుకు ఆవిరైపోతూ వస్తోంది. జనవరి నుంచి అదానీ గ్రూప్ మార్కెట్ విలువలో 10 లక్షల కోట్లు (10 ట్రిలియన్లు రూపాయలకు పైగా పతనమైంది. సోమవారం ఒక్కరోజే  రూ. 51,610 కోట్లను కోల్పోవడం గమనార్హం. సోమవారం ఒక్క రోజు పతనంతో  గ్రూప్ మార్కెట్ విలువ 8.98 ట్రిలియన్‌ రూపాయిలకు పడిపోయింది.

(ఇదీ చదవండి: Valentine's Day 2023:వామ్మో..చాట్‌జీపీటీని అలా కూడా వాడేస్తున్నారట!)

హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలతో  జనవరి 24న ప్రారంభమైన మెల్ట్‌డౌన్, గ్రూప్ మార్కెట్ క్యాప్ నుండి 10.2 ట్రిలియన్ రూపాయలు లేదా 53 శాతం తుడిచి పెట్టుకుపోయింది మరోవైపు అదానీ గ్రూప్ ఛైర్మన్, గౌతం అదానీ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 24వ స్థానానికి దిగజారారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఫిబ్రవరి 14 నాటికి అదానీ నికర విలువ 52.4 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, నికర విలువ  53 బిలియన్‌ డాలర్లుగా  ఉంది.

గ్లోబల్ ఇండెక్స్ ప్రొవైడర్ ఎంఎస్‌సీఐ గత వారం చివరిలో దాని గ్లోబల్ ఇండెక్స్‌లలో భాగమైన కొన్ని గ్రూప్ కంపెనీల వెయిటింగ్‌లను తగ్గించడం, అలాగే గ్రూప్ తన క్యాపెక్స్ ప్లాన్‌లను తగ్గించాలని యోచిస్తున్న తాజా నివేదికల తరువాత తాజా నష్టాలు సంభవించాయి. ఇప్పటికే హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను తిప్పి కొట్టిన అదానీ గ్రూప్ కొన్ని కంపెనీల స్వతంత్ర ఆడిట్‌ల కోసం అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థోర్న్టన్‌ను నియమించినట్టు తెలుస్తోంది. (Valentines Day2023: జియో బంపర్‌ ఆఫర్స్‌

అంతా బానే ఉంది: ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్‌ భరోసా 
ఇన్వెస్టర్లకు భరోసా కల్పించేందుకు అదానీ గ్రూప్‌ ప్రయత్నాలు చేస్తోంది. తమ వ్యాపార ప్రణాళికలకు అవసరమైన నిధులు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. వాటాదారులకు మంచి రాబడులే అందించగలమంటూ ధీమా వ్యక్తం చేసింది. వృద్ధి లక్ష్యాలు, పెట్టుబడులను కుదించుకుంటున్నట్లు వస్తున్న వార్తలను గ్రూప్‌ అధికార ప్రతినిధి ఖండించారు. ప్రస్తుత మార్కెట్‌ కుదుటపడిన తర్వాత గ్రూప్‌లోని ప్రతీ సంస్థ తన వ్యూహాల సమీక్ష చేపడుతుందని చెప్పారు. 

మరిన్ని వార్తలు