Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

13 Oct, 2022 18:16 IST|Sakshi

1. ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి: సీఎం జగన్‌
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆలూరు నుంచి వచ్చిన కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. మునుగోడు దంగల్‌.. మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
కేసీఆర్‌ పెన్షన్లు పెంచితే.. మోదీ పెద్దోళ్లకు దోచిపెడుతున్నారని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా బంగారిగడ్డ నుంచి చండూరుకు టీఆర్‌ఎస్‌ భారీ ర్యాలీ నిర్వహించింది.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. Monkeypox: 70 వేలు దాటిన మం‍కీపాక్స్ కేసులు.. ఇదే డేంజర్ టైమ్‌!
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు 70వేల మార్కును దాటాయి. కొత్త కేసులు తగ్గుతున్నప్పటికీ నిర్లక్ష‍్యంగా ఉండొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించింది. ఇప్పటివరకు అన్ని దేశాల్లో కలిపి మంకీపాక్స్ బాధితుల సంఖ్య 70వేలు దాటిందని, మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి ఆరోగ్య సంస్థకు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ నివేదిక సమర్పించారు.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె!
తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం అభ్యర్ధి రుతుజా లట్కేను తమవైపు లాక్కునేందుకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపినట్లయింది.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. నరబలి ఘటన మరువక ముందే క్షుద్రపూజల కలకలం.. కన్నతండ్రే కూతుర్ని..
కేరళలో మహిళల నరబలి ఘటన మరువక ముందే గుజరాత్‌లో మరో దారుణం వెలుగుచూసింది. కన్నతండ్రే క్షుద్రపూజలు చేసి 14ఏళ్ల కూతుర్ని చంపాడు. ఆమెకు గంటలపాటు నరకం చూపించి చావుకు కారణమయ్యాడు. గిర్‌ సోమ్‌నాథ్ జిల్లా ధవా గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. రిస్క్‌లో 90 లక్షల కస్టమర్ల సమాచారం.. ఎస్‌బీఐ సహా పలు సంస్థల డేటా లీక్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులతో సహా 90 లక్షల కార్డ్ హోల్డర్ల ఆర్థికపరమైన డేటా భారీ లీకైనట్లు సైబర్-సెక్యూరిటీ పరిశోధకులు బయటపెట్టారు. సింగపూర్ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు జరుపుతున్న CloudSEK సంస్థ ఈ విషయాన్ని గుర్తించింది.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. బీసీసీఐ అధ్యక్ష పదవి కోల్పోవడంపై నోరు విప్పిన గంగూలీ
బీసీసీఐ అధ్యక్షుడిగా రెండోసారి కొనసాగేందుకు విశ్వప్రయత్నాలు చేసి భంగపడ్డ సౌరవ్‌ గంగూలీ.. పదవి కోల్పోవడంపై తొలిసారి నోరు విప్పాడు. ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన దాదా ఈ విషయంపై స్పందిస్తూ.. ఆటగాడిగా, అడ్మినిస్ట్రేటర్‌గా జీవిత కాలం కొనసాగడం కుదురదని, ఏదో ఒక రోజు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందేనని వైరాగ్యంతో నిండిన మాటలు మాట్లాడాడు.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఎట్టకేలకు విడాకుల వార్తలపై స్పందించిన దీపికా
బాలీవుల్‌ స్టార్‌ కపుల్‌ దీపికా పదుకొనె-రణ్‌వీర్‌ సింగ్‌లు విడాకులు తీసుకోబుతున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రణ్‌వీర్‌ నగ్న ఫొటోషూట్‌ వివాదం నుంచి వారి వైవాహిక బంధంలో మనస్పర్థలు వచ్చాయని, అందువల్లే వీరు విడిపోతున్నారనే వాదనలు వినిపించాయి.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్‌కు షాక్.. గుజరాత్ పార్టీ చీఫ్ అరెస్టు
ఆమ్‌ ఆద్మీ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియాను ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అనంతరం ఆయనను సరిత విహార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 2019 నాటి ఓ వీడియోలో ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూటిక్‌ ఉందా?! ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే సంగతులు
సోషల్‌ మీడియా వేదికగా బ్లూ టిక్‌ మేనియా గురించి మనకు తెలిసిందే. దీని ఆధారంగానే మన సందేశం లేదా ఫొటో అవతలి వారు చూశారు అన్నది తెలిసిపోతుంది. మన ఆలోచనలను ప్రదర్శించడానికి, షేర్‌ చేయడానికి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వేదిక ఇన్‌స్టాగ్రామ్‌.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు