రఘురామ లాంటి వారిని ఉపేక్షించొద్దు: ఎంపీ భరత్‌

24 May, 2022 05:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇతర పార్టీలకు అమ్ముడుపోయిన రఘురామకృష్ణరాజు లాంటి వారిని ఉపేక్షించరాదని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని రెండేళ్లుగా కోరుతున్నామన్నారు. పార్టీ అధినేతను దూషిస్తూ తాను ప్రభుత్వాన్ని అంటున్నానని అతితెలివి చూపుతున్నాడన్నారు.

సోమవారం భరత్‌ మీడియాతో మాట్లాడుతూ రఘురామపై అనర్హత వేటు వేయాలని పలుమార్లు స్పీకర్‌కు నివేదించామని,  ఆలస్యం చేయొద్దని కోరగా ప్రివిలేజ్‌ కమిటీకి  సిఫార్సు చేశారన్నారు. ప్రధాని మోదీపై బీజేపీ చట్టసభ సభ్యులెవరైనా విమర్శలు చేస్తే ఇలాగే ఊరుకుంటారా అని ప్రశ్నించారు.  

ఇదిలా ఉండగా, రఘురామ అనర్హత పిటిషన్‌పై మౌఖిక సాక్ష్యం ఇవ్వడానికి సోమవారం ఎంపీ భరత్‌రామ్‌ లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ ముందు హాజరయ్యారు. చైర్మన్‌ సునీల్‌కుమార్‌ సింగ్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పిటిషన్‌పై త్వరగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు