‘చంద్రబాబు ఉగ్రవాదుల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడు’

28 Oct, 2021 16:57 IST|Sakshi

న్యూఢిల్లీ: చంద్రబాబు ఉగ్రవాదుల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని, దొంగల ముఠాను ఎన్నికలకు అనుమతిస్తే దేశం పరిస్థితి అధోగతి పాలవుతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు లోకేష్‌, బోండా ఉమ, దేవినేని ఉమ, పట్టాభి వ్యాఖలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు.

రాజ్యంగ బద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి పై అసభ్యపదజాలాన్ని ఉపయోగిస్తున్న విషయాన్ని వివరించామని తెలిపారు. అనాగరికంగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోని.. ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్న తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దుచేయాలని కోరామన్నారు. రాజ్యంగా బద్ధంగా జరిగే ఎన్నికలలో టీడీపీ ఉగ్రవాదులకు స్థానంలేదని మండిపడ్డారు. కాగా, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్న వారిపై కేసులు పెడితే తప్పేంటని ఎన్నికల సంఘం ప్రశ్నించిందని అన్నారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నంబర్లను పంపాలని ఈసీ కోరిందని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

చదవండి: స్వా​మీజీల పీఠాలకు భూములు ఇస్తే తప్పేంటి?: మంత్రి వెల్లంపల్లి

మరిన్ని వార్తలు