‘కన్ఫ్యూషన్‌ ఏం లేదు.. ఏ పార్టీలో చేరాలో స్పష్టత ఉంది’

5 Oct, 2021 11:40 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

కన్ఫ్యూజన్‌ అంటూ ఏమీ లేదు

జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీల పొత్తు అంశం తేలిన తర్వాతే నిర్ణయం

అది బీజేపీనా.. కాంగ్రెస్సా అనేది ఇప్పుడే చెప్పలేను

టీఆర్‌ఎస్‌ ఉద్యమ పార్టీ కాదు..  కేసీఆర్‌ కుటుంబ పార్టీ 

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి  

సాక్షి, రంగారెడ్డి: తాను ఏ పార్టీలో చేరాలా అనే అంశంపై కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లు కేటీఆర్‌ బినామీ మీడియాలో తనపై దుష్ట్రచారం చేస్తున్నారని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. తనకంటూ ఓ స్పష్టత ఉందన్నారు. సోమవారం బంజారాహిల్స్‌లో సీనియర్‌ నాయకులు సురేష్‌రెడ్డి, కొండా రాందేవ్‌రెడ్డి, రౌతు కనకయ్య, బీమేందర్‌రెడ్డి, కొండా కృష్ణారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు.

ఎన్నికల ముందు అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అనేక సమీకరణాలు జరుగనున్నాయని, అధికారం కోసం జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకునే అవకాశం ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ ఏదో ఒక జాతీయ పారీ్టతో జతకట్టే అవకాశం ఉందని.. ఇది తేలిన తర్వాతే చేరికపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పని చేసే పారీ్టలోనే చేరనున్నట్లు ప్రకటించారు. అది బీజేపీనా.. కాంగ్రెసా అనేది ఇప్పుడే చెప్పలేనన్నారు. 
చదవండి: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక: ఉత్సాహవంతులకు ఊహించని దెబ్బ

అందుకే ఆ పార్టీని వీడాను..  
ఉద్యమ పార్టీగా చెప్పుకొంటున్న టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం తెలంగాణ వాదులెవరూ లేరని విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. ఒకరిద్దరు ఉన్నా వారికి ఎలాంటి అధికారం లేదని అధికారమంతా తండ్రీ కొడుకులకే పరిమితమైందని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌ చేతుల్లో బందీగా మారిన తెలంగాణ తల్లికి విముక్తి కల్పించేందుకు కలిసి వచ్చే పార్టీలతో పని చేస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్‌ నియంతృత్వ పోకడలకు నిరసనగానే ఆ పార్టీని వీడాల్సి వచి్చందన్నారు.  

నా మద్దతు ఈటలకే 
వందల కోట్లు ఖర్చు చేసినా.. భారీగా పోలీసులను మోహరించినా హుజురాబాద్‌లో గెలిచేది మాత్రం ఈటల రాజేందరేనని జోస్యం చెప్పారు. బీజేపీలో చేరకపోయినా తన సంపూర్ణ మద్దతు ఆయనకేనని పునరుద్ఘాటించారు. ఒకప్పుడు తనకు వ్యతిరేకంగా పని చేసినప్పటికీ.. తాను మాత్రం ఆయనకు అనుకూలంగా పని చేయనున్నట్లు వెల్లడించారు.  
చదవండి: ఎన్నిక వచ్చినప్పుడల్లా సవాలేనా?: ఎమ్మెల్సీ కవిత

రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం 
కేసీఆర్‌ సీఎం అయ్యాక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం చేశారన్నారు. రూ.15,000 కోట్లు ఖర్చు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టి.. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చేపట్టారని ఆరోపించారు. జిల్లాకు సాగునీరిస్తానని చెప్పి, ఎడారిగా మార్చేశారన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని గాలికొదిలేసి జిల్లాలో కొత్తగా మరో మూడు ఆస్పత్రులు నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  

మరిన్ని వార్తలు