కాంగ్రెస్‌లో చేరకపోవడానికి కారణం ఇదే: ప్రశాంత్‌ కిషోర్‌

26 Apr, 2022 16:37 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ చేరికపై గంపెడు ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు నిరాశే ఎదురైంది. పార్టీలో చేరి బాధ్యతలు తీసుకోవాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా అందించిన ఆఫర్‌ను పీకే తిరస్కరించారు. కాంగ్రెస్‌లో ఎంపవర్డ్‌ యాక్షన్‌ గ్రూప్‌ 2024 సభ్యుడిగా చేరి, ఎన్నికలకు బాధ్యత వహించాలనే ప్రతిపాదనకు కూడా ఆయన నో చెప్పారు. కాంగ్రెస్‌ ఇచ్చే ప్రత్యేక బాధ్యతలు తనకొద్దని, వాళ్ల చట్రంలో తాను ఇమడలేనని అన్నారు. ఈ మేరకు పీకే ట్విటర్‌లో స్పందించారు.

వ్యవస్థాగతంగా లోతైన సమస్యల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి తనకన్నా నాయకత్వం, సమష్టి సంకల్పం అవసరం అంటూ ఆయన ట్వీట్ చేశారు.  కాంగ్రెస్‌లో తాను చేరడం, చేరకపోవడం అంత ముఖ్యం కాదని, కాంగ్రెస్‌లో పూర్తిగా పునర్‌వ్యవస్థీకరణ జరగడం ముఖ్యమని అన్నారు. కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులు రాకపోతే ప్రయోజనం లేదని అన్నారు. సాధికారత కమిటీలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనన తాను తిరస్కరించినట్టు తెలిపారు.
చదవండి👉 ఎంపీ నవనీత్‌కౌర్‌ ఆరోపణలకు పోలీసుల కౌంటర్‌


 

మరిన్ని వార్తలు