చలో రాజ్‌భవన్‌: పోలీసుల ఓవరాక్షన్‌.. పరిగెత్తించి మరీ 

16 Jul, 2021 14:59 IST|Sakshi

Revanth Reddy Protest: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి హాజరవుతున్న కార్యకర్తలను, నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడమే కాక అరెస్ట్‌లకు దిగుతున్నారు. ముందుగా అనుమతి తీసుకుని.. శాంతియుతంగా నిరసన తెలపుతున్న తమను పోలీసులు అడ్డుకోవడం ఏంటని కాంగ్రెస్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారు. 

ఈ క్రమంలో టీపీసీసీ ప్రెసెడింట్‌ రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో ఇందిరా పార్క్‌ దగ్గర నిరసన తెలపుతున్న వెంకట్‌ బల్మూర్‌ అనే కాంగ్రెస్‌ కార్యకర్తను పోలీసులు రోడ్డు మీద పరిగెత్తించి మరీ అరెస్ట్‌ చేశారు. ఒక్క వ్యక్తిని అరెస్ట్‌ చేయడం కోసం దాదాపు ఏడేనిమిది మంది పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం వెంకట్‌ని బలవంతంగా అక్కడ నుంచి తీసుకెళ్లారు. 

ఇందుకు సంబంధించిన వీడియోని రేవంత్‌ రెడ్డి తన ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘‘పోలీసులు దారుణ ప్రవర్తనకు నిదర్శనం ఈ వీడియో. ముందస్తు అనుమతితో శాంతియుతంగా నిరసన చేస్తున్న కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. పోలీసులు టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు గులాం గిరి చేస్తున్నారు’’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 

మరిన్ని వార్తలు