India vs Australia 1st T20I: రింకూ ది ఫినిషర్‌.. ఆస్ట్రేలియాపై భారత్‌ విజయం

23 Nov, 2023 18:32 IST|Sakshi

విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో 2 వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని 19. 5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టీమిండియా ఛేదించింది. భారత బ్యాటర్లలో స్టాండింగ్‌ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అతడితో పాటు ఇషాన్‌ కిషన్‌(58), రింకూ సింగ్‌(22) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 208 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్‌ ఇంగ్లీష్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 50 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఇంగ్లీష్‌ 110 పరుగులు చేశాడు. అతడితో పాటు స్టీవ్‌ స్మిత్‌(52), డేవిడ్‌ (19) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బిష్ణోయ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలా వికెట్‌ సాధించారు.

సూర్యకుమార్‌ యాదవ్‌ ఔట్‌..
విజయానికి మరో 15 పరుగులు అవసరమైన సమయంలో సూర్యకుమార్‌ యాదవ్‌ వికెట్‌ను టీమిండియా కోల్పోయింది. 80 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌.. బెహ్రెండార్ఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి అక్షర్‌ పటేల్‌ వచ్చాడు.

విజయం దిశగా భారత్‌..
తొలి టీ20లో టీమిండియా విజయం దిశగా అడుగులు వేస్తోంది. 18 బంతుల్లో భారత్‌ విజయానికి కేవలం 20 పరుగులు కావాలి. క్రీజులో సూర్యకుమార్‌ యాదవ్‌(76), రింకూ సింగ్‌(11) పరుగులతో ఉన్నారు.

నాలుగో వికెట్ డౌన్‌.. తిలక్‌ వర్మ ఔట్‌
154 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 12 పరుగులు చేసిన తిలక్‌ వర్మ.. సంఘా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 171/4. టీమిండియా విజయానికి 24 బంతుల్లో 38 పరుగులు కావాలి. క్రీజులో సూర్యకుమార్‌(65), రింకూ సింగ్‌(10) పరుగులతో ఉన్నారు.

సూర్యకుమార్‌ హాఫ్‌ సెంచరీ..
టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో సూర్య హాఫ్‌ సెంచరీ సాధించాడు.

టీమిండియా మూడో వికెట్‌ డౌన్‌.. ఇషాన్‌ కిషన్‌ ఔట్‌
ఇషాన్‌ కిషన్‌ రూపంలో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. హాప్‌ సెంచరీతో అదరగొట్టిన గిల్‌(39 బంతుల్లో 58).. సంఘా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి తిలక్‌ వర్మ వచ్చాడు. భారత విజయానికి 42 బంతుల్లో  74 పరుగులు కావాలి.

దూకుడుగా ఆడుతోన్న సూర్యకుమార్‌, కిషన్‌
సూర్యకుమార్‌ యాదవ్‌(48), ఇషాన్‌ కిషన్‌(48) అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడుతున్నారు. వీరిద్దరూ 12 ఓవర్లు ముగిసే సరికి 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 12 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 124/2

9 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 98/2
209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 9 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌(37), ఇషాన్‌ కిషన్‌(36) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నారు. భారత్‌ విజయానికి 66 బంతుల్లో 111 పరుగులు కావాలి.

5 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 54/2
5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్‌ యాదవ్‌(18), ఇషాన్‌ కిషన్‌(13) పరుగులతో ఉన్నారు.

రెండో వికెట్‌ డౌన్‌.. జైశ్వాల్‌ ఔట్‌
22 పరుగుల వద్ద 22 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. 21 పరుగులు చేసిన యశస్వీ జైశ్వాల్‌.. షార్ట్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వచ్చాడు.

టీమిండియా తొలి వికెట్‌ డౌన్‌.. రుత్‌రాజ్‌ ఔట్‌
209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 11 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ డైమండ్‌ డక్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి ఇషాన్‌ కిషన్‌ వచ్చాడు. 

చెలరేగిన ఆసీస్‌ బ్యాటర్లు.. 
విశాఖ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 208 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్‌ ఇంగ్లీష్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 50 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఇంగ్లీష్‌ 110 పరుగులు చేశాడు. అతడితో పాటు స్టీవ్‌ స్మిత్‌(52), డేవిడ్‌ (19) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బిష్ణోయ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలా వికెట్‌ సాధించారు.

ఆసీస్‌ మూడో వికెట్‌ డౌన్‌.. 
ఆస్ట్రేలియా మూడో వికెట్‌ కోల్పోయింది. సెంచరీతో విధ్వంసం సృష్టించిన జోష్‌ ఇంగ్లీష్‌.. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 50 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఇంగ్లీష్‌ 110 పరుగులు చేశాడు. 19 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్‌: 203/3, క్రీజులో స్టోయినిష్‌(5), టిమ్‌ డేవిడ్‌(10) ఉన్నారు.

జోష్‌ ఇంగ్లీస్‌ సెంచరీ.. భారీ స్కోర్‌ దిశగా ఆసీస్‌
వైజాగ్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జోష్‌ ఇంగ్లీష్‌ సెంచరీతో చెలరేగాడు.  కేవలం 47 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో తన తొలి టీ20 సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 17 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 179/2

ఆసీస్‌ రెండో వికెట్‌ డౌన్‌.. స్మిత్‌ ఔట్‌
161 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్‌ కోల్పోయింది. 52 పరుగులు చేసిన స్టీవ్‌ స్మిత్‌ రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి స్టోయినిష్‌ వచ్చాడు. 

దంచి కొడుతున్న ఆస్ట్రేలియా బ్యాటర్లు.. 
ఆస్ట్రేలియా బ్యాటర్లు దంచి కొడుతున్నారు. ముఖ్యంగా ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జోష్‌ ఇంగ్లీష్‌ టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. బౌండరీలతో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు.

కేవలం 38 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అతడితో పాటు స్టీవ్‌ స్మిత్‌(40) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 14 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్‌: 130/1


దూకుడుగా ఆడుతోన్న ఇంగ్లీష్‌.. 
9 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ వికెట్‌ నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో జోష్‌ ఇంగ్లీష్‌(37), స్టీవ్‌ స్మిత్‌(23) పరుగులతో ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌..
టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన ఆస్ట్రేలియా 31 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. 13 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్‌ను రవి బిష్ణోయ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. క్రీజులోకి జోష్‌ ఇంగ్లీష్‌ వచ్చాడు.

2 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 20/0
టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన ఆస్ట్రేలియా 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్‌ స్మిత్‌(13), మాథ్యూ షార్ట్‌(4) పరుగులతో ఉన్నారు.

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌ సమరానికి రంగం సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా తొలి టీ20లో టీమిండియా-ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.  ఈ సిరీస్‌కు రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోహ్లి, హార్దిక్‌తో పాటు సీనియర్‌ ఆటగాళ్లు దూరమయ్యారు.

దీంతో యువ భారత జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు వరల్డ్‌ ఛాంపియన్స్‌ ఆస్ట్రేలియా జట్టుకు సీనియర్‌ ఆటగాళ్లు అందుబాటులో లేరు. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టును వెటరన్‌ మాథ్యూ వేడ్‌ నడిపించనున్నాడు.

తుది జట్లు
ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్‌), జోష్ ఇంగ్లిస్, మాథ్యూ షార్ట్, నాథన్ ఎల్లిస్, సీన్ ఆంథోనీ అబాట్, స్టీవ్ స్మిత్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెండార్ఫ్, మార్కస్ స్టోయినిస్, తన్వీర్ సంఘా

భారత్‌: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ (వైస్‌ ‍కెప్టెన్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్

మరిన్ని వార్తలు