తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌

24 Nov, 2023 21:29 IST|Sakshi

Telangana Assembly Elections Today Minute To Minute Update

  • ఎస్సీ వర్గీకరణపై కేంద్రం చర్యలు
  • వర్గీకరణ ప్రక్రియ చేపట్టాలయి క్యాబినెట్‌ కార్యదర్శకి ప్రధాని మోదీ ఆదేశం
  • కమిటీ ఏర్పాటు చేసి ప్రక్రియ వేగవంతం చేయాలని సూచన

బీఆర్‌ఎస్‌కు భారీ ఊరట.. రైతుబంధుకు ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

  • రైతుబంధు యాసంగి నిధుల విడుదలకు సీఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ 
  • రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లోకి వేయడం ప్రారంభించిన ప్రభుత్వం

మాజీ ఐఏఎస్‌ గోయెల్ ఇంటి వద్ద ఉద్రిక్తత

  • ఓ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ విలువైన వస్తువులు తీసుకొని పోతున్నారని ఆరోపణ
  • పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట
  • టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్‌ బైక్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకరలు
  • పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర ఘర్షణ
  • కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు
  • ఇంటికి చేరుకున్న మాజీ ఐఏఎస్‌ గోయల్
  • గోయల్ సమక్షంలో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

మంచిర్యాలలో వివేక్‌ కామెంట్స్‌

  • తుగ్లక్ ముఖ్యమంత్రి కాళేశ్వరం కట్టిండు 
  • పుస్తకాలు చదివి ఎవడైనా ప్రాజెక్టు కడతాడ
  • వాస్తవానికి సీఎం కేసీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయాలి అప్పుడే నిజాలు బయటికి వస్తాయి
  • ఎంపీగా ఉన్నపుడు 14 కోట్లతో చెన్నూర్‌లో మంచి నీటి సరఫరా పథకం తెచ్చాను
  • మందమర్రి, ఆర్కే పురంలో కూడా కాంగ్రెస్ హయాంలో ఉన్న అభివృద్దే ఇప్పటికీ ఉంది
  • ఎంపీగా ఉన్నప్పుడు రెండు రైల్వే బ్రిడ్జి లని సాంక్షన్ చేయించాను బాల్క సుమన్ గా ఉన్న ప్రజలకు చేసింది ఏమి లేదు.

తుంగతుర్తిలో రేవంత్‌ రెడ్డి కామెంట్స్ 

  • తెలంగాణలో నియామకాలు కేసీఆర్ కుటుంబానికే పరిమితమయ్యాయి
  • మనుమడిని మంత్రిని చేసేదుకే కేసీఆర్ మూడోసారి అవకాశం ఇవ్వాలంటుండు
  • పది ఎకరాల్లో నిర్మించుకున్న కేసీఆర్ గడీలోకి పేదలకు ప్రవేశం లేదు
  • పేదోడి చెమట వాసన ఎట్లుంటదో కేసీఆర్‌కు తెలియదు
  • నన్ను రానివ్వకపోయినా సరే 
  • అమరుల కుటుంబాలకు కూడా ప్రగతి భవన్‌లోకి ప్రవేశం లేదు
  • కేసీఆర్ బక్కోడు కాదు.. లక్ష కోట్లు దిగమింగిన బకాసురుడు
  • కేసీఆర్‌కు సారా పొసే వ్యక్తి ఇక్కడ మంత్రిగా ఉన్నడు
  • నాడు రాజాకార్లను తరిమిన చరిత్ర నల్లగొండది
  • కేసీఆర్‌కు సారా పోసేవారు ఇక్కడ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న పరిస్థితి దాపురించింది
  • డిసెంబరు 9న ఇందిరమ్మ రాజ్యం తెచ్చి చర్లపల్లి జైల్లో కేసీఆర్‌కు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తాం
  • కేసీఆర్ నిన్న ప్రగతి భవన్‌లో అత్యవసర సమావేశం పెట్టిండు
  • ఓడిపోతామన్న భయంతో ఓటుకు పది వేలు ఇచ్చి గెలవాలని చూస్తుండ్రు
  • కేసీఆర్ ఇచ్చే పదివేలు తీసుకోండి... కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించండి

టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కామెంట్స్‌

  • ఐఏఎస్ అధికారి ఏకే గోయెల్ ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి
  • వాటి వివరాలు పూర్తిగా బయటపెట్టాలి
  • అధికార పార్టీకి చెందిన డబ్బులు పెద్దఎత్తున గోయెల్ ఇంట్లో ఉన్నట్లు సమాచారం ఉంది
  • ఐటీ దాడులలో నగదు భారీగా గుర్తించినట్టు తెలిసింది
  • ఐటీ అధికారులు మీడియా వాళ్లను అక్కడకు రానివ్వడం లేదు
  • ఎలాంటి దాపరికాలు లేకుండా పూర్తి వివరాలు సమాజానికి తెలియజేయాలి

కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కామెంట్స్

  • శ్రేయోభిలాషుల మీద ఐటీ దాడులు చేయించిన  ఘనత కేసీఆర్‌ది.
  • డిసెంబర్ 9 న కాంగ్రెస్ విజయభేరీ మోగనుంది 
  • అసెంబ్లీ ఎన్నికల సెమీ ఫైనల్లో కాంగ్రెస్‌దే విజయం
  • తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలది ఆధర్మ పాలన 
  • కంకి కొడవలి గుర్తు కి ఓటు వేసి కూనంనేనిని భారీ మెజారిటీతో గేలిపించండి

అంబర్‌పేట్‌లో బీజేపీ ప్రచారం

  • రోడ్‌ షోలో పాల్గొన్న అమిత్‌ షా, కిషన్‌రెడ్డి 

రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఇంట్లో సెర్చ్‌ ఆపరేషన్‌

  • హైదరాబాద్‌లో  రిటైర్డ్ ఐఏఎస్ ఏకే గోయెల్‌ ఇంట్లో ఎలక్షన్‌ స్క్వాడ్‌ సెర్చ్ ఆపరేషన్
  • జూబ్లీహిల్స్ నివాసంలో తనిఖీలు నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం అధికారులు
  • ఎన్నికల డబ్బు భారీ డంప్ ఉందన్న సమాచారంతో సోదాలు
  • 2010లో పదవీ విరమణ చేసిన తర్వాత ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన గోయెల్‌

వర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేపట్టిన డీకే శివకుమార్‌

  • కేఆర్‌ నాగరాజును భారీ మెజార్టీతో గెలిపించాలి
  • నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశారు
  • మడికొండలో డంపింగ్ యార్డ్‌ను ఎత్తేస్తాం 
  • కేసీఆర్‌ చేసిన అవినీతి అక్రమాలపై విచారణ జరుపుతాం
  • కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే కచ్చితంగా అమలు చేస్తుంది
  • సోనియా గాంధీకి, దళితులకు వెన్ను పోటు పొడిచిన మోసకారి కేసీఆర్‌

సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, బృందాకరత్ 3 రోజుల టూర్‌

  •  25న సాయంత్రం పాలేరులో పర్యటన
  •  26న మధ్యాహ్నం భువనగిరిలో సభ
  •  27న మిర్యాలగూడ నియోజకవర్గంలో రోడ్ షో 
  •  25న వైరా నియోజకవర్గంలో బృందాకారత్‌ రోడ్ షో
  • సాయంత్రం మధిర నియోజకవర్గంలో సభ
  • 26న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సభ
  • 27న భద్రాచలంలోని దుమ్ముగూడెం, చర్లలో సభలు
  • 28న కోదాడ హుజూర్‌నగర్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొననున్నారు

 కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌కు షాక్‌

  • బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ గాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక 
  • కామారెడ్డి ఆపరేషన్‌ ఆకర్ష్‌తో బీఆర్‌ఎస్‌లో ఆందోళన

సీఈఓ వికాస్‌రాజ్‌ను కలిసిన బీజేపీ నేతలు

  • యువ ఓటర్లను ఓటు వేయకుండా బీఆర్‌ఎస్‌ అడ్డుకుంటోందని ఫిర్యాదు
  • పోలింగ్  రోజు జరిగే పరీక్షలను వాయిదా వేయాలని కోరిన బీజేపీ నేతలు

నకిరేకల్ సభలో రేవంత్ రెడ్డి కామెంట్స్

  • తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని వదులుకుండు
  • కేసీఆర్ ఎన్నడూ పదవులను పూచికపుల్లలా వదిలేయలేదు
  • ఎలక్షన్లు సెలక్షన్లు, కలెక్షన్లు విధానంతో కేసీఆర్ ముందుకెళ్లిండు
  • కానీ వెంకట్ రెడ్డి తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి తీసుకోలేదు
  • బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఏ ఒక్కరినీ అసెంబ్లీ గేటు తాకనీయొద్దు
  • ఇప్పుడు మీరు ఇవ్వబోయే తీర్పు వందేళ్ల వరకు చరిత్రలో నిలిచిపోవాలి

కొత్తగూడెంలో కాంగ్రెస్‌ సభ రద్దు

  • కొత్తగూడెలో ప్రియాంక గాంధీ సభ రద్దు
  • హైదరాబాద్‌కు బయలుదేరిన ప్రియాంక
  • రాత్రి తాజ్‌కృష్ణలో బస చేయనున్న ప్రియాంక గాంధీ

భద్రాద్రితో భట్టి విక్రమార్క కామెంట్స్‌..

  • కొత్తగూడెం ప్రజలు రాజకీయంగా చాలా చైతన్య వంతులు. 
  • పలు ఉద్యమాలలో కూనంనేని పాల్గొన్నారు.
  • కేసీఆర్ వచ్చాక సింగరేణి చాలా కష్టాల్లోకి  వెళ్ళింది.
  • సింగరేణి కార్మికులు ఉద్యమంలో ఉధృతంగా పాల్గొన్నారు.
  • ధనిక రాష్టాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందే కేసీఆర్‌.
  • రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే అప్పులు లేని రాష్ట్రంగా చేస్తాం 
  • రేవంత్, నేను 6 గారెంటీలు ప్రకటించాము.
  • కాంగ్రెస్ వచ్చాక ఈ 6 గ్యారెంటీ లు అందరికి చేరుస్తాం.
  • రాష్ట్ర సంపద అంతా పేదలకు పంచుతాం.
  • ఈరోజు మీరు బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే కేంద్రంలో ఉన్న బీజేపీకి ఓటు వేసినట్టే.

రాజేంద్రనగర్‌లో అమిత్‌ షా కామెంట్స్‌..

  • బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతికి పాల్పడిన కేసీఆర్‌ను జైలుకు పంపిస్తాం.
  • ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఉగ్రవాదులను ఎన్‌ఐఏ పట్టుకుంది. 
  • ఇక్కడ ఉన్న పోలీసులు ఏమీ చేయలేదు. 
  • కేసీఆర్‌.. ఒవైసీకి భయపడతారు. 
  • కారు స్టీరింగ్‌ ఒవైసీ చేతిలో ఉంది. 
  • ఒవైసీకి భయపడి కేసీఆర్‌ ఎలా పాలన సాగిస్తాడు. 
  • ఈసారి బీజేపీకి ఓటు వేయండి. అభివృద్ధి చేసి చూపిస్తాం. 

హుస్నాబాద్‌లో ప్రియాంకా గాంధీ పర్యటన

  • ప్రాణత్యాగం చేసిన అమరుల ఆకాంక్షలు నెరవేరాయా?:
  • ముఖ్యమంత్రి మీకు ఉద్యోగం ఇచ్చారా?
  • ఇలాంటి ప్రభుత్వం మరో  పదేళ్లు కావాలా?
  • బీఆర్‌ఎస్‌ ఏం చేసిందో చెప్పగలరా?
  • ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు ఇచ్చుకున్నారు
  • కానీ మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు
  • కష్టపడి మీ పిల్లలను చదివించుకుంటున్నారు
  • కష్టపడి చదివితే పేపర్లు లీకులు అవుతున్నాయి
  • ఉద్యోగాలు లేనప్పుడు ఆ చదువు వృథానే అవుతుంది
  • పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవినీతి నిలయాలుగా నిలుస్తున్నాయి
  • రైతు రుణమాఫీని బీఆర్‌ఎస్‌-బీజేపీలు మరుగన పడేశాయి
  • దళితులు, గిరిజనుల కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేయలేదు
  • ప్రధాని మోదీ దేశ సంపదను అదానికీ అప్పచెప్పారు
  • అదానీ ఒక రోజు రూ. 1600 కోట్లు సంపాదిస్తున్నారు
  • ఒవైసీ ఎప్పుడూ రాహుల్‌ గాంధీనే విమర్శిస్తారు
  • ఆ మూడు పార్టీలు కలిసి మీతో ఆడుకుంటున్నాయి
  • తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ మధ్య జరుగుతున్నాయి

  • కొల్లాపూర్‌ పీఎస్‌ ముందు జూపల్లి ధర్నా 
  • నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
  • కొల్లాపూర్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన  జూపల్లి కృష్ణారావు
  • అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ గేటు ముందు ధర్నా చేసిన జూపల్లి
  • రాత్రి తన కార్యకర్తలపై పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా ధర్నా
  • పోలీసులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణ

శిరీష అలియాస్‌ బర్రెలక్కకు భద్రత కల్పించండి: హైకోర్టు

  • కొల్లాపూర్ స్వాతంత్య్ర అభ్యర్థి శిరీష అలియాస్‌ బర్రెలక్కకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశం
  • ఎన్నికలు పూర్తయ్యే వరకు భద్రత కల్పించాలని  ఆదేశాలు
  • బర్రెలక్క నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌లకు భద్రత కల్పించాలి
  • గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదు
  • ముప్పు ఉందని అభ్యర్థించే అభ్యర్థులకు సెక్యూరిటీ కల్పించాలి
  • అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్‌దే
  • పోలీసుల కేవలం కార్లు చెక్‌ చేస్తాం అంటే కుదరదు
  • బర్రెలక్కకు ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలి

నేతల ప్రచారంపై వాతావరణం ఎఫెక్ట్‌.. హెలికాప్టర​ బంద్‌

  • ఎన్నికల ప్రచారంలో పాల్గొనే నేతలపై వాతావరణం ఎఫెక్ట్‌ చూపిస్తోంది.
  • వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్‌ ప్రయాణం రద్దువుతోంది. 
  • కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ పాలకుర్తి రోడ్డు మార్గంలో చేరుకున్నారు.
  • మరోవైపు.. బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వెనక్కి తిరిగి వచ్చిన రేవంత్‌
  • రోడ్డు మార్గంలో నకిరేకల్‌ చేరుకున్న రేవంత్‌ 

ఖర్గే నోరు అదుపులో పెట్టుకో: హరీష్‌ రావు

  • ఎల్లారెడ్డిలో బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున హరీష్ రావు రోడ్ షో 
  • అమెరికా నుంచి వచ్చి సంతలో పశువులను కొన్నట్టు కొంటున్నారు. 
  • కర్ణాటకలో 5 గ్యారెంటీలని ఊదరగొట్టారు.
  • కానీ కర్ణాటకలో ఇప్పుడు లబో దిబో మొత్తుకుంటున్నారు.
  • రెండు మూడు గంటలు కరెంట్ రావటం లేదట.
  • గతప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదు
  • కేసీఆర్ కరెంట్, చెరువులు, విత్తనాలు, వరి కొనుగోలు సమయంలో ఇచ్చారు.
  • అప్పట్లో ఊళ్లలో కరువు ఉంది అనేటోళ్లు .. ఇప్పుడు రైతులు అన్నదాతలు అయ్యారు.
  •  రైతులకు డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం.
  • ఖర్గే నోరు అదుపులో పెట్టుకో.

కేసీఆర్ ఏది చెప్పినా అది చేసి చూపెడతారు: ఎమ్మెల్సీ కవిత

  • నిజామాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ గుప్తా తరఫున నాగారంలో రోడ్ షో.
  • వచ్చే ఐదేళ్లలో పేదల సొంతింటి కలను తాము నిజం చేస్తాం.
  • 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు చేసింది ఏమీ లేదు.
  • తెలంగాణ రాక ముందు ఈ నగరంలో దయనీయ పరిస్థితి ఉండేది.
  • ఇప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించాం.
  • త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇప్పిస్తాం.
  • బీఆర్ఎస్ కొత్త మ్యానిఫెస్టోలో ఉన్న అంశాలు పేదలకు ఎంతో ఉపయోగపడతాయి.
  • కేసీఆర్ ఏది చెప్పినా అది చేసి చూపెడతారు.
  • కాంగ్రెస్ పాలనలో కేవలం ఒక్కటే మైనారిటీ పాఠశాల ఉండేది. ఇప్పుడు జిల్లాలో 23 మైనార్టీ పాఠశాలలు ఏర్పాటు చేం.
  • మానవతా దృక్పథంతో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలి.

కారు ఇంజన్‌లో నోట్ల కట్టలు.. అగ్నికి ఆహుతి

  • వరంగల్‌లో డబ్బులతో ఉన్న కారులో మంటలు
  • బొల్లికుంట వాగ్దేవి కాలేజీ వద్ద కారు ఇంజన్‌లో మంటలు
  • కారు ఇంజన్‌లో డబ్బులు తరలిస్తుండగా వేడికి కాలిపోయిన నోట్లు
  • పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు కొందరు వ్యక్తులు  కారు డిక్కీ ముందు భాగంలో డబ్బులను అమర్చారు
  • వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపు వెళ్తుండగా బొల్లికుంట క్రాస్ రోడ్ వద్ద కారులో మంటలు చెలరేగి డబ్బులు అగ్నికి ఆహుతి అయ్యాయి

  • తెలంగాణ భవన్ లో ఆటో యూనియన్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం
  • హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  • హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రయాణించిన కేటీఆర్
  •  రాయదుర్గం నుంచి బేగంపేటకు ప్రయాణం చేసిన కేటీఆర్
  • మెట్రో ప్రయాణికులతో మాట మంతి

కేటీఆర్‌కు బండి  సంజయ్‌ ప్రశ్నలు 

  • పేదరికం తగ్గితే.. తెలంగాణ అప్పుల కుప్పగా ఎందుకు మారిందో చెప్పాలి
  • దళితబంధు, బీసీబంధు పథకాలు ఎందుకు అందరికీ ఇవ్వలేకపోయారు
  • నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేకపోయారు 
  • ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారు
  • ఉద్యోగులకు 15వ తారీఖు వరకు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు
  • ఈ నెల 27న కరీంనగర్‌ మోదీ సభ కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం
  • ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని  పిలుపు

కేసీఆర్‌ నీ టైం అయిపోయింది: అమిత్‌ షా

  • తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ల ప్రచారం
  • ఆర్మూర్‌లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ
  • ఇచ్చిన ఏ హామీని తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చలేదు
  • పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ తెలంగాణను నాశనం చేసింది 
  • 2014లో దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు
  • ఆర్టీసీ స్థలాలను కేసీఆర్‌ సర్కార్‌ కబ్జా చేసింది
  • టేబుల్‌పై డబ్బు పెట్టిన వాళ్లనే కేసీఆర్‌ మంత్రుల్ని  చేస్తున్నారు
  • కేసీఆర్‌ నీ టైం అయిపోయింది
  • కేసీఆర్‌ అవినీతిపై విచారణ చేయించి జైలుకు పంపడం ఖాయం
  • అవినీతిపరులందరినీ జైలుకు పంపే కార్యక్రమం బీజేపీ చేపట్టింది
  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు తెలంగాణ కోసం ఏం చేయలేదు
  • కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది
  • బీడీ కార్మికుల కోసం నిజామాబాద్‌లో ప్రత్యేక ఆస్పత్రిని నిర్మిస్తాం
  • అధికారంలోకి వస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తాం
  • ఇక్కడ బీజేపీని గెలిపిస్తే.. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తాం
  • అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం
  • మోదీ నాయకత్వంలో దేశం అగ్రగామిగా నిలిచింది


కాంగ్రెస్‌ మంచినీళ్లు కూడా ఇవ్వలేదు: కేసీఆర్‌

  • మంచిర్యాల బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ.. పాల్గొన్న సీఎం కేసీఆర్‌
  • కాంగ్రెస్‌ వల్ల తెలంగాణ 58 ఏళ్లు గోస పడింది
  • తెలంగాణకు కాంగ్రెస్‌ చేసింది ఏం లేదు
  • గోదావరి పక్కనే ఉన్నా కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు
  • రైతుల్ని ఆదుకోవాలని కాంగ్రెస్‌ ఏనాడూ ఆలోచించలేదు
  • రైతు బంధు అనే పదం తెచ్చిందే బీఆర్‌ఎస్‌
  • ధరణిని తీసేస్తే డబ్బులు ఎలా వస్తాయి
  • మంచి ఎమ్మెల్యేను ఎన్నుకుంటేనే మంచి జరుగుతుంది

హైకోర్టులో మధ్యాహ్నం బర్రెలక్క పిటిషన్‌ విచారణ

  • తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన కోల్లాపూర్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థిని కర్రె శిరీష అలియాస్‌ బర్రెలక్క
  • దాడుల నేపథ్యంలో 2 ఫ్లస్‌ 2 భద్రత కోరిన శిరీష
  • పోలీసుల నుంచి సరైన స్పందన ఉండడం లేదని ఆరోపణ
  • మధ్యాహ్నాం పిటిషన్‌ను విచారించనున్న హైకోర్టు


జైరాం వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్‌

  • ఖమ్మంలో కాంగ్రెస్‌ సీనియర్‌ జైరాం రమేష్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్‌
  • జైరాంపై బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు మండిపాటు
  • జైరాం రమేష్ ఖబర్ధార్.. చరిత్రను అవమానించకండి
  • తెలంగాణ సోనియా వల్ల రాలేదు.. సకల జనుల పోరాటంతో తెలంగాణ వచ్చింది
  • ప్రజాస్వామ్యంలో కుటుంబాలకు గుప్తాధిపత్యం ఉండవద్దు
  • బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయి
  • కుటుంబ రాజకీయాలకు అంతం పలకాల్సిన అవసరం ఉంది
  • సామాజిక తెలంగాణ కావాలంటే బీజేపీతోనే సాధ్యం
  • ఎంఐఎం ఉన్న హైదరాబాద్లో సెక్యులరిజానికి తావు లేదు 
  • పహాడీషరీఫ్ లో మైనార్టీల కోసం ప్రత్యేకంగా ఐటి పరిశ్రమ ఏర్పాటు చేయడం ఏంటి?

ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తాం: మల్లు రవి

  • మీడియాతో కాంగ్రెస్‌ నేత, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి
  • రానున్న ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకరావడం ఖాయం.
  • రాష్ట్రంలో ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి..  తమకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ప్రజలు బావిస్తున్నారు.
  • తెలంగాణ లో బీఆర్ఎస్ పార్టీ కి ప్రత్యామ్నాయంగా దేశానికి స్వాతంత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.
  • తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీ స్కీమ్ లు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో అమలు చేస్తాం..


మాకు అహంకారం లేదు: కేటీఆర్‌

  • క్రెడాయ్‌ ఆధ్వర్యంలో జరిగిన రియల్ ఎస్టేట్ సమ్మిట్‌లో కేటీఆర్‌ ప్రసంగం
  • 2014 లోనే తెలంగాణ లో మార్పు వచ్చింది
  • వైఎస్సార్‌ హయాంలో ప్రో రూరల్‌, ప్రో అగ్రికల్చర్‌, ప్రో ఇన్వెస్టిమెంట్‌ ఉండేది
  • ఇప్పుడు కేఏసీఆర్‌ హయాంలో ప్రో అగ్రికల్చర్‌, ప్రో డెవలప్‌మెంట్‌, ప్రో రూరల్‌ ఉంది
  • కోవిడ్ మినహా ఆరున్నరెళ్ల పాలన మీ ముందుంది
  • పాతికేళ్ల కిందటి ముఖ్యమంత్రుల పని తీరు.. ఇప్పటి సీఎం పనితీరు గమనించాలి
  • తెలంగాణ వచ్చాక ఐటీ భారీగా అభివృద్ది చెందింది
  • ఐటీ ఎగుమతులు పెరిగాయి
  • తెలంగాణ లో ఐటీ పెరిగింది అంతే స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెరిగాయి
  • రాష్ట్ర సంపద పెరుగుతుంది 
  • రియల్ ఎస్టేట్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి
  • కచ్చితంగా వాటిని పరిష్కరిస్తాం
  • ప్రతిపక్షాలకు మమ్మల్ని తిట్టడానికి ఏం కనిపించటం లేదు
  • తిట్టడమే పని గా పెట్టుకున్నారు
  • గతంలో నీళ్ళు, కరెంట్ సమస్య లు ఉండేవి
  • కానీ అవన్నీ ఇప్పుడు పుష్కలంగా ఉంది
  • చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చింది కేసీఆర్‌
  • మాకు అహంకారం లేదు
  • తెలంగాణపై చచ్చేంత మమకారం ఉంది
  • ఎవరెన్ని గగ్గోలు పెట్టినా మళ్ళీ మేమే అధికారం లోకి వస్తున్నాం
  • నేను దాదాపు 70 నియోజకవర్గలో తిరిగాను
  • గ్రౌండ్ రియాల్టీ అంత మాకే అనుకూలంగా ఉంది 
  • వచ్చే ప్రభుత్వం మాదే

తెలంగాణ ఎన్నికలు.. కౌంటింగ్‌ సెంటర్ల ప్రకటన

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కోసం కేంద్రాలను ప్రకటించిన ఎన్నికల సంఘం
  • మొత్తం 33 జిల్లాల్లో.. 116 కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాటు
  • సమస్యాత్మ ప్రాంతాల్లో కట్టదిట్టమైన భద్రత ఉంటందని ప్రకటన

    కౌంటింగ్‌ కేంద్రాలు ఇవే

ఆర్మూర్‌ బయల్దేరిన అమిత్‌షా

  • హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో కేంద్ర మంత్రి అమిత్‌ షా
  • ఆర్మూర్‌ ప్రచార సభ కోసం హెలికాఫ్టర్‌లో బయల్దేరిన షా
     

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అబ్రహం

  • బీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చిన జోగులాంబ గద్వాల్‌ జిల్లా అలంపూర్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే అబ్రహం
  • రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన అబ్రహం
  • అలంపూర్‌ టికెట్‌ను తొలుత అబ్రహంకే  ఇచ్చిన బీఆర్‌ఎస్‌
  • ఆ తర్వాత చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజయుడికి ఇచ్చిన బీఆర్‌ఎస్‌ 

హైదరాబాద్‌కు చేరుకున్న జాతీయ నేతలు

  • హైదరాబాద్‌కు పార్టీల అగ్రనేతలు
  • బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న బీజేపీ అగ్రనేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌లు
  • అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ కూడా 
  • సాయంత్రం నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రాజ్‌నాథ్‌
  • అగ్రనేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ స్వాగతం
  • శంషాబాద్‌కు చేరుకున్న కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా
  • ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికిన రాష్ట్ర ఇంచార్జి మాణిక్‌రావ్‌ థాక్రే
  • ప్రతికూల వాతావరణం కారణంగా.. రోడ్డు మార్గంలో జనగామ జిల్లా పాలకుర్తికి ప్రియాంక
  • పాలకుర్తి ప్రచారంలో భాగంగా.. బహిరంగ సభలో పాల్గొననున్న ప్రియాంక
  • హుస్నాబాద్‌, కొత్తగూడెంలోనూ ప్రియాంక బహిరంగ సభలు
  • సాయంత్రం ఖమ్మంలోనే ఆమె బస

మల్లారెడ్డి సన్నిహితుడి ఇంట పోలీసుల తనిఖీలు

  • మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి సన్నిహితుడి ఇంట పోలీసుల సోదాలు
  • హైదరాబాద్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు 
  • మంత్రి మల్లారెడ్డికి సంజీవరెడ్డి అత్యంత సన్నిహితుడు
  • ఎలక్షన్  ఫ్లాయింగ్  స్కాడ్  ఆధ్వర్యంలో.. సంజీవరెడ్డి ఇంట్లో సోదాలు జరుపుతున్న పోలీసులు
  • సంజీవరెడ్డి ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

క్షుద్రరాజకీయాల్ని ప్రజలు గమనించాలి: రేవంత్‌రెడ్డి

  • తెలంగాణ ప్రజలకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
  • బీజేపీ - బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయి
  • అత్యున్నత ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను సైతం మోడీ, కేసీఆర్ రాజకీయ క్రీడలో పావులుగా మార్చేశారు. 
  • ఆ రెండు పార్టీలలో చేరిన వాళ్లు పవిత్రులు... ప్రతిపక్షంలో ప్రజల తరఫున కొట్లాడే వాళ్లు ద్రోహులా?
  • రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదు... ప్రశ్నించే గొంతులే మిగలకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారు.
  • ఇది బీజేపీ - బీఆర్ఎస్ మధ్య కుదిరిన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్. 
  • కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి... 
  • వీటి వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివి?! 

డబ్బుల పంపిణి కట్టడి చేయండి: ECI

  • ఎన్నికల వ్యయ పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్
  • పాల్గొన్న తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్,  డీఈవోలు
  • హాజరైన రాష్ట్ర వ్యాప్త 69మంది వ్యయ పరిశీలకులు
  • హైదరాబాద్ జిల్లా నుంచి పాల్గొన్న 8మంది ఎక్స్పెండిచర్ అబ్ జర్వర్లు
  • రాష్ట్ర వ్యాప్తంగా డబ్బుల పంపిణి కట్టడి పై చర్చ
  • డబ్బుల పంపిణి కట్టడిలో చివరి రెండు రోజులు కీలకమన్న కేం‍ద్ర ఎన్నికల సంఘం

పదేళ్లైనా.. బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ లక్ష్యం నెరవేరలేదు

  • ఖమ్మం సంజీవరెడ్డి భవన్ లో జైరాం రమేష్, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం
  • బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ జాతీయ నేత జైరాం రమేష్‌ ఫైర్
  • నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే సోనియా తెలంగాణ ఇచ్చారు
  • రైతులు, మహిళలు, యువత కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని నిర్ణయించారు
  • అప్పుడు హైదరాబాద్‌లోనే పెట్టుబడులు వచ్చేవి.. ఇప్పుడు అక్కడికే వస్తున్నాయి
  • ప్రత్యేక రాష్ట్ర అయ్యాక తెలంగాణ ప్రజలు మేలు జరిగిందా?
  • పదేళ్ల ముందు తెలంగాణ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది
  • బ్రాండ్‌ హైదరాబాద్‌ ఒక్కటే కాదు.. బ్రాండ్‌ తెలంగాణ సృష్టించడమే సోనియా లక్ష్యం
  • నిరుద్యోగుల శాతం తెలంగాణలో అధికంగా ఉంది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాలులు లీక్‌ అవతున్నాయి
  • ఉద్యోగాలు లభించక నిరుద్యోగులు ఆత్మహత్యలుచేసుకుంటున్నారు
  • సామాజికన్యాయం అమలు చేయాలని సోనియా ఆకాంక్షించారు.
  • ఉన్నత  పదవులన్నీ కేసీఆర్‌ కుటుంబానికే వెళ్లాయి.
  • బీసీ, బీసీ, దళితులకు తెలంగాణలో ఎన్ని పదవులు వచ్చాయి
  • ఎందుకు తెలగాణ ఏర్పాటు చేశామో.. పదేళ్ల తర్వాత కూడా ఆ లక్ష్యాలు సాధించలేదు
  • జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్‌కు కొత్త జోష్‌ 
  • తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు  అధికారం ఇవ్వబోతున్నారు

తాండూరులో ఐటీ దాడులు

  • యలాల మండలం జక్కేపల్లి సమీపంలోని ఆర్‌బీఆఎల్‌ ఫ్యాక్టరీపై దాడులు.
  • కాంగ్రెస్‌ అభ్యర్థి మనోహార్‌రెడ్డి సోదరుడు శ్రీనివాస్‌రెడ్డికి చెందిన ఫ్యాక్టరీ

  • తాండూరులో 44 లక్షల 84 వేల 500 రూపాయలు పట్టివేత 
  • కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డికి చెందిన డబ్బుగా అనుమానిస్తున్న పోలీసులు
  • డబ్బులు తరలిస్తున్న ఓ పత్రికకు చెందిన స్థానిక రిపోర్టర్‌ను చారిస్తున్న పోలీసులు

ఆరు గ్యారంటీలతో కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది: భట్టి

  • ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు నమ్మొద్దు అని కేసీఆర్ అంటున్నారు.
  • ఆరు గ్యారంటీలతో ప్రజల సంపద ప్రజల పంచాలన్నదే కాంగ్రెస్ ధ్యేయం.
  • ప్రజల సంపద ప్రజలకు పంచాలా? పాలకులు పంచుకుని తినాలా? ఎందుకు కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలు నమ్మొద్దు?
  • కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలు నమ్మొద్దు, నమ్మొద్దు అంటే కేసీఆర్ ఉద్దేశం ఏంటి? మళ్లీ ఐదు సంవత్సరాలు మేమే పంచుకు తింటామని చెప్పడమా?
  • కాంగ్రెస్ ఉంటనే కరెంటు వచ్చింది.
  • కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పవర్ ప్లాంట్ల వల్ల ఉత్పత్తి అవుతున్న కరెంటుతో నేడు కొరతలేదు.
  • కరెంటు అనేది కాంగ్రెస్ పేటెంట్ రైట్.
  • కరెంటు ఉత్పత్తి ఎలా చేయాలి? నాణ్యమైన కరెంటును ఉత్పత్తి చేసి రైతులకు ఎలా సరఫరా చేయాలన్నది కాంగ్రెస్‌కు పాలన అనుభవం ఉంది.
  • రెండు రోజుల పాటు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో జరిగే ప్రియాంక గాంధీ సభలను విజయవంతం చేయాలని పిలుపు.

ఎన్నికలపై తుఫాను ఎఫెక్ట్‌

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వర్షం ఆటంకం
  • 26న వాయుగుండంగా మారుతుందన్న వాతావరణ శాఖ
  • 28వ తేదీ సాయంత్రంతో ముగియనున్న ప్రచారం 
  • ఇప్పటికే.. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ సభ రద్దు
  • మిగతా పార్టీల సభల షెడ్యూల్‌లోనూ మార్పులు చేసుకునే అవకాశం 
  • జనసమీకరణ కష్టం అవుతుందని పార్టీల దిగులు

తెలంగాణ ప్రచారంలో డీకేఎస్‌ బిజీబిజీ

  • నేడు రేపు నల్లగొండలో కాంగ్రెస్‌ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ప్రచారం
  • ఎల్లుండి కూడా మరికొన్ని నియోజకవర్గాల్లో 
  • అంబర్‌పేటలో ప్రచారంలో పాల్గొననున్న డీకే శివకుమార్‌
     

జోగులాంబలో ఉద్రిక్తత 

  • జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో ఉద్రిక్తత 
  • బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల
  • మాల వేసే క్రమంలో విరిగిన విగ్రహం వేలు
  • ప్రచార రథాన్ని అడ్డుకుని ఆందోళన చేపట్టిన గ్రామస్తులు
  • పోలీసుల రంగ ప్రవేశంతో ఉద్రిక్త వాతావరణం

పువ్వాడపై నారాయణ సంచలన వ్యాఖ్యలు 

  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాట్‌ కామెంట్స్
  • ఖమ్మంలో సీపీఐ కాంగ్రెస్కు సపోర్ట్ చేయదు అనే అపోహ ఉంది
  • పువ్వాడ నాగేశ్వరరావు కొడుకు పువ్వాడ అజయ్కు సీపీఐ సపోర్ట్ చేస్తుందనే అపవాదు సృష్టిస్తున్నారు
  • అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇవాళ్టి తో చెక్ పెట్టాలి
  • అజయ్‌కు సపోర్ట్ చేస్తే సీపీఐ లోని ఎంత పెద్ద నేత ఉన్న వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం
  • తులసి వనంలో గంజాయి మొక్కలాంటోడు పువ్వాడ అజయ్ కుమార్
  • తండ్రికి మూడు నామాలు పెట్టిన వ్యక్తి అజయ్ కుమార్
  • అటువంటి వ్యక్తి కి cpi మద్దతు ఇవ్వదు
  • జిల్లాలో పార్టీకి ఎంతో కృషి చేసిన వ్యక్తి పువ్వాడ నాగేశ్వర్ రావు
  • ఉమ్మడి  ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఓడిపోయే సీటు అజయ్ నే

తెలంగాణ పవర్‌ బీఆర్‌ఎస్‌దే: రాజ్‌నీతి సర్వే

  • రాజ్‌నీతి సర్వేలో బీఆర్‌ఎస్‌కే పట్టం 
  • 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. 38,351 మంది.. మొత్తం తొమ్మిది వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ
  • రైతులు, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, బస్సు/ఆటోడ్రైవర్లు, పక్కా ఇళ్ల యజమానులు, ఇతరులు
  • సర్వేలో పాల్గొన్న అన్ని సామాజిక వర్గాల ప్రజలు, అన్ని వయస్సుల వాళ్‌లు
  • బీఆర్ఎస్‌కు 75 స్థానాలు.. 42.43 శాతం ఓట్లు
  • కాంగ్రెస్‌కు 31 స్థానాలు.. 32. 62 శాతం ఓట్లు  
  • ఎంఐఎంకు ఏడు
  • బీజేపీకి ఐదు స్థానాలు.. 16.71 శాతం ఓటింగ్‌ మాత్రమే
  • మూడోసారి బీఆర్‌ఎస్‌కే పట్టమని రాజ్‌నీతి రిపోర్ట్‌

రేపటి కేసీఆర్‌ సభ రద్దు

  • హైదరాబాద్‌లో శనివారం బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ 
  • పరేడ్‌ గ్రౌండ్స్‌లో సభకు హాజరుకావాల్సిన అధినేత కేసీఆర్‌
  • వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన బీఆర్‌ఎస్‌


ఆ మూడు ఒక్కటే.. ఎలిమినేట్‌ చేయాలి: నారాయణ

  • ఖమ్మంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియా సమావేశం
  • కాంగ్రెస్, సీపీఐ కు ఓటేస్తే బిజెపి, బీఆర్ ఎస్ ,ఏంఐఎం మూడు పార్టీలు ఎలిమినెట్ అవుతాయి
  • బిజెపి, బీఆర్ ఎస్, ఏంఐఎం మూడు పార్టీలు పరస్పరం ఒప్పందం లో భాగంగానే ముందుకు వెళుతున్నాయి
  • గోషామాల్ లో బిజెపి నుంచి రాజాసింగ్ పోటీ చేసే చోట ఏంఐఎం అభ్యర్థి ని నిలబెట్టలేదు.. కానీ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న చోట ఏంఐఎం అభ్యర్థి ని నిలబెట్టింది.
  • ఇది ఒక్కటి చాలు వీళ్లంతా ఎంతలా కలిసి ఉన్నారో చెప్పటానికి!
  • పైకి ఒకరిపై ఒకరు విమర్శించుకున్నట్లు చేసేవాన్ని డ్రామాలే
  • కాంగ్రెస్, సీపీఐ గెలిస్తే దేశ రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతాయి
  • కర్ణాటక లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్లనే తెలంగాణ లో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది
  • కాంగ్రెస్‌ వాళ్లు ముదుర్లు.. ఐదు సీట్లు అడిగితే ఒక్కటి ఇచ్చారు

అవినీతి ఆరోపణలపై స్పందించాలి:హైకోర్టు ఆదేశం 

  • ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎమ్మెల్సీ కవిత, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ నేత బండి సంజయ్, ఎంపీ అర్విద్‌ సహా ఇతర పార్టీల నేతల ఒకరిపై ఒకరు చేసుకున్న అవినీతి ఆరోపణలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై విచారణ జరపాలని సమర్పిచిన వినతిపత్రాలను ఈ నెల 30లోగా పరిష్కరించాలని ఎన్నికల కమిషన్, రాష్ట్ర డీజీపీని ఆదేశించిన హైకోర్టు
  • ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం కోసం ఒక పార్టీ వారిపై మరొకరు తీవ్ర అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారని, నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారని.. వీటిపై విచారణ జరిపేలా ఈసీ, అధికారులను ఆదేశించాలని కోరుతూ నిజామాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఎంఏ ఖాదర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు.
  • ఈ నెల 2న డీజీపీ, 4న సీఈవోకు ఈ అంశంపై వినతిపత్రం సమర్పించానని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
  • పిటిషనర్‌ సమర్పించిన వినతిపత్రాలను 30లోగా పరిష్కరించాలని ఈసీ, డీజీపీని ఆదేశిస్తూ, పిటిషన్‌పై వాదనలను ముగించింది. 

ప్రాణం పోయినా వెనకడుగేయను: బర్రెలక్క 

  • కొల్లాపూర్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన కర్నె శిరీష అలియాస్‌ బర్రెలక్క
  • నేను ఓట్లు చీల్చుతాననే భయంతో కొందరు నాపై దాడులకు ప్రయత్నిస్తున్నారు.
  • నా తమ్ముడిపై దాడికి పాల్పడింది ఎవరో.. వారు ఏ పార్టీ వారో కూడా తెలుసు. కానీ, నేను వారి పార్టీ పేరు వెల్లడించను.
  • ప్రాణం పోయినా.. ఈ పోరాటంలో వెనకడుగు వేయను.
  • ‘నాలుగైదు సార్లు గెలిచిన వాళ్లు, అధికార పార్టీ వాళ్లు నన్ను చూసి భయపడుతున్నారు. అందుకే రౌడీమూకలతో నాపై దాడులకు ప్రయత్నిస్తున్నారు.
  • నాకు మద్దతుగా ప్రచారం చేస్తున్న మధు అనే అన్నను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం నుంచి తొలగించారు. అండగా నిలుస్తున్న వారిని బెదిరిస్తున్నారు.
  • అయినా నేను దేనికీ భయపడను. నేను ఇప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేసినా.. భవిష్యత్‌లో వెయ్యి అడుగులు వెనక్కి వేసినదాన్ని అవుతా. యువతకు ఇది తప్పుడు సంకేతం ఇస్తుంది.
  • హైకోర్టులో బర్రెలక్క పిటిషన్‌పై  నేడు విచారణ 
  • గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడినందున 2ప్లస్‌2 గన్‌మెన్లతో భద్రత కల్పించాలని కోరుతూ కర్నె శిరీష (బర్రెలక్క) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు
     

నేటి నుంచి 3 రోజులపాటు రాష్ట్రంలో అమిత్‌ షా పర్యటన 

  • కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రాష్ట్రంలో మరోసారి సుడిగాలి పర్యటన
  • ఎన్నికల ప్రచారం మరింత ఉధృతం.. శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలో విస్తృతంగా పర్యటన
  • శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూర్‌లో సకల జనుల విజయ సంకల్ప బహిరంగ సభలో షా ప్రసంగం
  • తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్, 3 గంటలకు శేరి లింగంపల్లి, సాయంత్రం 4.30 గంటలకు అంబర్‌పేట నియోజకవర్గాల పరిధిలో అమిత్‌షా రోడ్‌ షో 
  • 25న ఉదయం 11 గంటలకు కొల్లాపూర్, మధ్యాహ్నం ఒంటి గంటకు మునుగోడు, 2 గంటలకు పటాన్‌చెరు నియోజకవర్గాల బహిరంగ సభల్లో ప్రసంగం
  • సాయంత్రం 4 గంటలకు ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో రోడ్‌ షోలో పాల్గొననున్న అమిత్‌షా
  • 26వ తేదీన ఉదయం 11 గంటలకు మక్తల్, మధ్యాహ్నం 1 గంటకు ములుగు, మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరి, సాయంత్రం 6 గంటలకు కూకట్‌పల్లి నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభల్లో అమిత్‌ షా ప్రసంగం
  • అదేరోజు రాత్రి 8 గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియంలో కోటి దీపోత్సవంలో పాల్గొననున్న అమిత్‌షా

రేపు రాష్ట్రానికి రాహుల్‌ గాంధీ

  • ఒకే రోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం 
  • బోధన్, ఆదిలాబాద్, వేములవాడ సభలకు రానున్న ఏఐసీసీ అగ్రనేత
  • నేటి నుంచి రెండు రోజులపాటు ప్రియాంక పర్యటన... షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు 
  • నేడు, రేపు రాష్ట్రంలో పర్యటించనున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్‌ ఖరారు 

  • 3 రోజులు.. 6 బహిరంగ సభలు
  • తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు రోజుల పాటు మోదీ పర్యటన
  • శనివారం మధ్యా హ్నం బెంగళూరు నుంచి కామారెడ్డికి చేరుకోనున్న ప్రధాని
  • మధ్యాహ్నం 2:15 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ
  • ఆ తర్వాత సాయంత్రం 4:15 గంటలకు రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో బహిరంగ సభ
  • రాత్రికి రాజ్‌భవన్‌లో బస
  • ఆదివారం ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్‌ శివార్లలోని కన్హా శాంతివనాన్ని సందర్శన 
  • అనంతరం మధ్యాహ్నం 2:15 గంటలకు దుబ్బాకలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ
  • ఆ తర్వాత మధ్యాహ్నం 3:45 గంటలకు నిర్మల్‌లో ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగం
  • రాత్రికి తిరుమలకు చేరుకొని అక్కడి శ్రీరచన రెస్ట్‌హౌస్‌లో బస
  • సోమవారం ఉదయం 8 గంటలకు శ్రీ వేంకటేశ్వర్వస్వామిని దర్శించుకోనున్న ప్రధాని
  • మధ్యాహ్నం 12:45 గంటలకు మహబూబాబాద్‌ చేరుకొని బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ
  • మధ్యాహ్నం 2:45 గంటలకు కరీంనగర్‌లో జరిగే బహిరంగ సభ
  • అనంతరం హైదరాబాద్‌ చేరుకోనున్న ప్రధాని
  • సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రోడ్‌షోలో పాల్గొననున్న మోదీ 

బహుముఖ వ్యూహంతో ప్రజల్లోకి బీఆర్‌ఎస్‌ 

  • విజయాలను వివరించి.. విమర్శలను తిప్పికొట్టి..
  • హ్యాట్రిక్‌ విజయానికి సర్వశక్తులూ ఒడ్డుతున్న గులాబీ దళం.. కేసీఆర్‌ బహిరంగ సభలు..కేటీఆర్, హరీశ్‌ రోడ్‌షోలు 
  • రాష్ట్రాభివృద్ధిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు..
  • పత్రికా ప్రకటనలు.. చానళ్లు, యూట్యూబర్లకు ఇంటర్వ్యూలు.. వివిధ వర్గాలతో ముఖాముఖీలు
  • పదేళ్లలో సాధించిన విజయాలపై వివరణ
  • విపక్షాల విమర్శలు తిప్పికొడుతూ ప్రణాళికాబద్ధంగా ముందుకు..

మరిన్ని వార్తలు