కవితను ఎలా చేర్చుకుంటాం?.. బండి సంజయ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

16 Nov, 2022 20:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లనంటే వెళ్తారనే అర్థం అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ చుట్టూ తిరిగిన కేసీఆర్‌నే చేర్చుకోలేదు, కవితను ఎలా చేర్చుకుంటాం అంటూ ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌లో భయం మొదలైందని ఆ పార్టీ నేతలు గుర్తించారు. బీజేపీ బలోపేతం కాకుండా అడ్డుకోవాలని కేసీఆర్‌ చెబుతున్నారన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న వాళ్లను ఏ చెప్పుతో కొట్టాలి అంటూ బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

‘‘ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్‌ ప్రమాదకర స్థాయిలో పెట్టాడు. బ్యూరో క్రాట్స్ కేసీఆర్ కాళ్లు మొక్కుతున్నారు. ఒకసారి మొక్కితే ఎమ్మెల్సీ.. రెండుసార్లు మొక్కితే ఎమ్మెల్యే.. మూడుసార్లు మొక్కితే మంత్రి’’ అంటూ బండి సంజయ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ వ్యతిరేకంగా ఉన్న వారంతా పార్టీలకతీతంగా బీజేపీకి ఓటు వేయాలన్నారు. ఏ పార్టీ అయినా సరే కోవర్టు నేతలను బయటకు గల్లా పట్టి గుంజి పడేయాలి. పొత్తు ప్రసక్తే లేదు. తెలంగాణలో ఒంటరిగానే పోరు. సింగిల్‌గా పోరాడి అధికారంలోకి వస్తాం’’ అని బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు.
చదవండి: కేంద్రం టార్గెట్‌గా సీఎం కేసీఆర్‌ కొత్త వ్యూహం!

మరిన్ని వార్తలు