చంద్రబాబు ఏడ్చినంత మాత్రాన సానుభూతి రాదు: ఉండవల్లి

27 Nov, 2021 17:32 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: భార్య పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏడుస్తున్న ఏడుపునకు సానుభూతి రాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్పష్టం చేశారు.  అసెంబ్లీలో జరగని ఘటనకు ఎన్ని వ్యాఖ్యానాలు జోడించినా ప్రజలు నమ్మరని ఉండవల్లి తెలిపారు. ఆయన శనివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు మీడియా ముందు ఏడిస్తే అందుకు సానుభూతి ఏమీ రాదన్నారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఎటువంటి సంబంధం లేదన్న ఉండవల్లి.. ఈ ఘటన తర్వాత సీబీఐ విచారణ కోరింది సీఎం వైఎస్‌ జగన్‌ అని గుర్తుచేశారు. అసెంబ్లీలో వైఎస్‌ వివేకానందరెడ్డి మృతిపై మాట్లాడటం తప్పని ఉండవల్లి తెలిపారు.

చదవండి: పోలవరంపై పట్టుబట్టాలి.. ఎంపీలకు సీఎం జగన్‌ మార్గ నిర్దేశం

మరిన్ని వార్తలు