పేదల దేవుడు డాక్టర్‌ వైఎస్సార్‌

26 Sep, 2022 04:28 IST|Sakshi

హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్సార్‌ పేరే సరైనది 

ఎన్టీఆర్‌ను ఘోరంగా అవమానించిన చంద్రబాబు 

ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరినప్పుడు కుటుంబ సభ్యులు ఏం చేశారు?

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని

చిలకలూరిపేట: పేదల దేవుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. వైద్య రంగంలో వైఎస్సార్‌ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి చరిత్రలో నిలిచిపోయారని ఆమె కొనియాడారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం మంత్రి రజిని విలేకరులతో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ బతికుండగా ఘోరంగా అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు.

ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీని, ఆయన బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు కూడా లాగేసుకున్నారని, జీవిత చరమాంకంలో మానసిక క్షోభకు గురి చేసి మరణించేలా చేసిన చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ జ్ఞాపకాలను చెరిపివేయాలని తపన పడిన టీడీపీ నాయకులు హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

ఎన్టీఆర్‌పై చంద్రబాబు చెప్పులు వేయించినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ అంటే తమ పార్టీకి, తమ నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి గౌరవం ఉందని, అందువల్లే ఆయన పేరును ఒక జిల్లాకు పెట్టారని చెప్పారు. చంద్రబాబు కనీసం ఈ పని కూడా చేయలేదన్నారు.

అందరి బంధువు సీఎం జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందరి బంధువు అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం ఆమె పల్నాడు జిల్లా చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారులతో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. 

మరిన్ని వార్తలు