దీదీ నీకు వాళ్ల గతే పడుతుంది: యోగి ఆదిత్యనాథ్‌

2 Mar, 2021 18:51 IST|Sakshi

కోల్‌కతా​: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం వేడెక్కుతోంది. బీజేపీ-తృణముల్‌ కాంగ్రెస్‌ మధ్య విమర్శలు తారస్థాయికి చేరుతున్నాయి. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రావడానికి సీఎం మమతా బెనర్జీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మంగళవారం బెంగాల్‌లోని మల్దాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మమతా బెనర్జీ ప్రభుత్వ విధానాలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మమతా బెనర్జీ బెంగాల్‌లో ఆవుల అక్రమ రవాణా, లవ్ జిహాద్‌లకు అనుమతి ఇస్తున్నారని మండిపడ్డారు. 

కేవలం ఓట్ల కోసమే అక్రమ వలసదారులను ప్రోత్సహింస్తున్నారని  విమర్శించారు. జై శ్రీరాం అనే నినాదాన్ని బెంగాల్‌లో అనుమంతిచడం లేదని, మతపరమైన సెంటిమెట్‌ను రాజకీయల కోసం  ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. యూపీలో రామ మందిర నిర్మాణానికి అడ్డుపడినవారికి పట్టిన గతి మమతకు బెంగాల్‌లో ఎదురవుతుందని హెచ్చరించారు. భారతదేశంలో రామునికి వ్యతిరేకంగా ఉండేవాళ్లు రామ ద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు. బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి, బీజేపీ అధికారంలోకి  వస్తుందని సీఎం యోగి ధీమా వ్యక్తం చేశారు.  294 నియోజకవార్గాలు ఉ‍్న పశ్చిమబెంగాల్‌లో 8 విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన విషషయం తెలిసిందే.‌ 

చదవండి: దీదీని కలిసిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌

మరిన్ని వార్తలు