పప్పు సుద్ద లోకేష్ పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి వచ్చే సీనుందా?

27 Jan, 2023 15:49 IST|Sakshi

కృష్ణా:టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కొడాలి నాని. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ అసమర్థుడని ధ్వజమెత్తారు. చందాలిచ్చిన వారికోసం తప్ప లోకేష్ పాదయాత్ర దేనికి పనికిరాదని ఎద్దేవా చేశారు.

లోకేష్ ఏం సాధించాడని, ఏ హోదాలో పాదయాత్ర చేస్తున్నాడు? అని కొడాలి ప్రశ్నించారు. చంద్రబాబు కొడుకు అని తప్ప లోకేష్‌ ఉ‍న్న అర్హత్ ఏంటి? అని అడిగారు. పోటీ చేసిన చోట ఓడిపోయిన పప్పు సుద్ద లోకేష్ అని దుయ్యబట్టారు. అలాంటి లోకేష్ పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి వచ్చే సీనుందా? అని ఎద్దేవా చేశారు.
చదవండి: పవన్‌ వ్యాఖ్యలపై మంత్రి అంబటి ఆసక్తికర ట్వీట్

మరిన్ని వార్తలు