భావోద్వేగాలు రెచ్చగొట్టే ఉద్దేశం మాకు లేదు: పేర్ని నాని

25 Jun, 2021 14:23 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాజకీయ అవసరాల కోసమే తెలంగాణ నేతల విమర్శలు చేస్తూ భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని మంత్రి పేర్ని నాని విమర్శించారు. తెలంగాణ కోసం వైఎస్ఆర్‌ ఏం చేశారో అందరికీ తెలుసు అన్నారు. కృష్ణా నది నుంచి గ్లాసు నీరు కూడా మేం అదనంగా తీసుకోవడం లేదు. శ్రీశైలం, సాగర్‌లో కేటాయించిన నీటినే వాడుకుంటున్నాం అని స్పష్టం చేశారు. కృష్ణా జలాల వినియోగంపై సందేహాలుంటే చర్చించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని.. నీటి వివాదంపై తెలంగాణ నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దని సూచించారు పేర్ని నాని.

భావోద్వేగాలు రెచ్చగొట్టే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని పేర్ని నాని తెలిపారు. కేంద్రం, పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలనేదే సీఎం విధానం అన్నారు. సుప్రీం ఆదేశాలతోనే పరీక్షలు రద్దు చేశామని తెలిపారు. పరీక్షలు రద్దయితే చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారు.. పిల్లల భవిష్యత్‌ను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు అంటూ పేర్ని విమర్శించారు. 

చదవండి: పోలవరం పులకింత

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు