సామాజిక న్యాయం సీఎం జగన్ ద్వారానే సాధ్యం

18 Nov, 2023 19:34 IST|Sakshi

సాక్షి, తణకు(పశ్చిమగోదావరి):  వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది.  నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికారితను వెలుగెత్తి చాటుతూ సాగుతున్న ఈ బస్సుయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. 

ఈరోజు(శనివారం) పశ్చిమగోదావరి జిల్లాలోని తణుణు నియోజకవర్గంలో సాగిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీనిలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ సంఘీభావం ప్రకటించారు.

సామాజిక సాధికారత బస్సుయాత్ర బహిరంగ సభ లో ఉభయ గోదావరి జిల్లాల రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేను రాజు, ఎలక్ట్రానికి మీడియా సలహాదారు అలీ, మంత్రులు తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరావు, మేరుగ నాగార్జున, జోగి రమేష్‌, ఎంపీ నందిగాం సురేష్‌, ఎంపీ భరత్‌లతో పాటు ఎమ్మెల్సీలు పోతుల సునీత, వంకా రవీంద్రనాథ్‌లు పాల్గొన్నారు.

హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ‘తణుకు సామాజిక సాధికార బస్సు యాత్రను ప్రజలు విజయవంతం చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం సీఎం జగన్ ద్వారానే సాధ్యం అయ్యింది. రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు జగనన్న అండగా నిలబడుతున్నారు. చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, రైతులు ఇలా అందరికి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న. పేద విద్యార్థుల ఉన్నత చదువుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం జగన్ ది. అందుకే ప్రతీ విద్యార్థి ఆయన్ను ఒక మేనమామలా చూస్తున్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తోన్న వ్యక్తి సీఎం జగన్. కరోనా లాంటి మహమ్మారి కాలంలో కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగించిన వ్యక్తి సీఎం జగన్. గత ప్రభుత్వాలతో పోలిస్తే జగనన్న హయాంలో పేదరికం 12  శాతం నుండి ఆరు శాతం వరకూ తగ్గింది. అందుకే జగన్ లాంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి. అలాగే కారుమూరి లాంటి మంచి నాయకుడిని కూడా మళ్ళీ గెలిపించుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు.

ఎంపీ భరత్ మాట్లాడుతూ..  ‘ఎవ్వరు కొడితే లోకేష్, చంద్రబాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో  ఆయననే మన జగనన్న. చంద్ర బాబు హయాంలో ఒక్క బీసీనైనా రాజ్యసభ కు పంపారా...?, వందల కోట్లకు సీట్లు అమ్ముకునే వాడు చంద్రబాబు. మళ్లీ కారుమూరి వన్స్‌మోర్‌’ అంటూ కారుమూరి నాగేశ్వరరావును గెలిపించాలని కోరారు.

ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. ‘ బీసీలను నిండా ముంచిన నాయకుడు చంద్రబాబు. సీఎం జగన్‌ మహిళలకు పెద్ద పీట వేశారు. కరోనా సమయంలో చేనేతలకు అండగా నిలిచారు సీఎం జగన్‌,. చంద్రబాబు హయాంలో చేనేతలకు రూ. 200 కోట్లు ఖర్చు పెడితే, నేడు జగనన్న ముఖ్యమంత్రిగా రూ. 4 వేల కోట్లు ఖర్చు పెట్టారు. బీసీలకు లక్షా 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు’ అని స్పష్టం చేశారు. 

ఇక విశాఖలో జరిగిన సామాజిక సాధికారిత సభలో మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ..  ‘సగానికి పైగా పదవులను బడుగు బలహీనర్గాలకు కట్టబెట్టారు.  ఒక ఊరులో ఇద్దరు బాగుండాలి అంటే చంద్రబాబు కావాలి.. ఊరు మొత్తం బాగు పడాలి అంటే సీఎం జగన్ రావాలి.ఒక యాదవనైన నాకు రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు.యాదవులు కు సీఎం జగన్ పదవులు ఇస్తే గొడ్లు కాసుకొనే వారికి పదవులు ఇచ్చారని హేళన చేశారు.శ్రీకృష్ణ డు కూడా గొడ్డెలను కాసుకున్నారు. బీసీలను తోకలు కత్తిరిస్తమని బెదిరించారు.పార్టీ పెట్టి సీఎం కాకూడదనుకున్న వ్యక్తి పవన్‌. చంద్రబాబు సీఎం కావాలని కోరుకునే వ్యక్తి పవన్.పవర్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. అబద్ధాలు మోసాలకు ప్రజలు ప్రలోబకావద్దు.లోకేష్ ఒక పులకేశి.తండ్రి జైల్ లో ఉండే ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్..సీఎం జగన్ దమ్ము నాయకుడు.నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయాలని సీఎం జగన్ చెపుతున్నారు..

మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ‘దశాబ్దాలుగా బడుగు బలహీనర్గాల వారు సంక్షేమం అభివృద్ధి దూరంగా ఉన్నారు.బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలను కూరలో కరివేపాకులా చూసేవారు.మత్స్యకారులను చంద్రబాబు బెదిరించారు. రూ. 150 కోట్లతో హార్బర్‌ను ఆధునీకరిస్తున్నారు. సీఎం జగన్ పాలనలో పది హార్బర్ లు, నాలుగు పోర్టులు నిర్మిస్తున్నారు.సుదీర్ఘమైన తీర ప్రాంతన్ని చంద్రబాబు గాలికి వదిలేసారు.మత్స్యకారుడుని రాజ్యసభకు పంపిన ఘనత సీఎం వైఎస్ జగన్ ది.బీసీలు జడ్జిలుగా పనికిరారని చంద్రబాబు లేఖలు రాశారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆత్మ గౌరవం ను చంద్రబాబు తాకట్టు పెట్టారు.అణగారిన వర్గాల ఆత్మ గౌరవంను సీఎం జగన్ కాపాడారు. ఇంటిపై టిడిపి జెండా కడితేనే పథకాలు ఇచ్చేవారు. సీఎం జగన్ పాలనలో కులాలు మతాలు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.విశాఖను పరిపాలన రాజధానిగా సీఎం జగన్ చేశారు.విశాఖ రాజదానిగా చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది.విశాఖ ను రాజదాని కాకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని రాజదాని గా చేశారు

whatsapp channel

మరిన్ని వార్తలు