బాత్రూమ్‌లో ఫోన్ వాడుతున్నారా.. ఈ సమస్యలు తప్పవా?

3 Nov, 2022 19:24 IST|Sakshi

అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ ఫోన్‌ ఇప్పుడు మన జీవితంలో అంతర్భాగమై పోయింది. గత దశాబ్దంన్నర కాలం నుంచి వ్యక్తులతో కమ్యూనికేట్‌ అవ్వడం దగ్గర నుంచి , కాలు కదపకుండా హోటల్‌ నుంచి ఫుడ్‌ ఇంటికి తెప్పించుకోవడం, ఆన్‌లైన్‌ షాపింగ్‌ వరకూ ఇలా అన్నింట్లో సహాయ పడుతుంది. అయితే దాని వల్ల ఎంత లాభం ఉందో అంతకంటే ఎక్కువ ప్రమాదం ఉందని సైంటిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. 

ఇటీవల అరిజోనా యూనివర్సిటీ సైంటిస్టులు జరిపిన ఓ అధ్యయనంలో మనం వినియోగించే స్మార్ట్‌ ఫోన్‌లలో 17 వేల బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా వినియోగించే టాయిలెట్‌ సీటు మీద ఉండే బ్యాక్టీరియా కంటే స్మార్ట్‌ ఫోన్‌ల మీద 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. 

టీనేజర్లు వినియోగించే  ఫోన్‌లమీద బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు అరిజోనా సైంటిస్ట్‌లు చెబుతున్నారు. ఎందుకంటే వారిలో ఎక్కువ మందికి బాత్రూంకు మొబైల్‌ తీసుకొని వెళ్లే అలవాటు ఉందని , ఎక్కువ సమయం బాత్రూంలో మొబైల్‌ వినియోగించడం వల్ల ఫోన్‌పై బ్యాక్టీరియా ఏర్పుడుతుందని హెచ్చరిస్తున్నారు. 

► 2016లో సోనీ సంస్థ జరిపిన సర్వేలో 41 శాతం మంది ఆస్ట్రేలియన్‌లు టాయిలెట్‌లో ఫోన్‌ వినియోగిస్తుండగా.. 75శాతం మంది అమెరికన్‌లు వాడుతున్నారు. అయితే అలా ఫోన్‌ వినియోగిస్తున్న వారు టైం వేస్ట్‌ చేయకుండా మల్టీ టాస్కింగ్‌ చేస్తున్నామని అనుకుంటున్నట్లు తేలింది. కానీ టాయిలెట్‌లో మొబైల్‌ వినియోగించడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామనే విషయాన్ని మరిచిపోతున్నారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.  

► డాక్టర్ కర్మాకర్ సలహా మేరకు.. ఫోన్‌ను బాత్రూంలోకి లేదంటే పబ్లిక్‌ ఏరియాల్లో వినియోగించకపోవడం ఉత్తమం. ఆహారం తీసుకునేటప్పుడు కూడా చాలా మంది తమ ఫోన్‌ని ఉపయోగిస్తుంటారు. నోటి ద్వారా  ఇన్‌ఫెక్షన్‌లు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి, ఫోన్‌లోని బ్యాక్టీరియా వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాల్ని పెంచుతుంది.

 చదవండి👉 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం

ఫోన్‌ను బాత్రూంలో వినియోగిస్తే వాటిల్లే ప్రమాదాలు 

►►ఫోన్‌ వినియోగిస్తూ బాత్రూంలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల పెద్ద ప్రేగుల్లో ఒత్తిడి పెరిగిపోతుంది.తద్వారా రెక్టల్ (మల ద్వార) సమస్యలు ఎక్కవుగా ఉత్పన్నమవుతాయి.

►► పెద్ద ప్రేగుల్లో ఒత్తిడి పెరిగితే జీర్ణాశయాంతర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించాలి

►► బాత్రూంలో ఫోన్‌ వినియోగిండం వల్ల టైం దుర్వినియోగం అవుతుంది. చేయాల్సిన వర్క్‌ ఆగిపోతుంది. మనకు తెలియకుండా మన లోపలి శరీరం ఒత్తిడికి గురవుతుంది.

►► మీరు ఉదయం పూట నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్రూం వెళ్లే సమయంలో ఫోన్‌ను వెంట తీసుకొని వెళుతున్నారా? అయితే మీరు ఉదయం పూట బాత్రూంలో ఫోన్‌ వినియోగించే సమయం కంటే.. ఫోన్‌ లేనప్పుడు బాత్రూంలో గడిపే సమయం ఎక్కువగా ఉంటుందని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. అందుకే ఉదయం   టాయిలెట్‌లోకి ఫోన్‌ తీసుకొని వెళ్లకపోవడమే ఉత్తమం. 

►► వెడ్ఎమ్‌డి హెల్త్‌ జర్నల్‌ ప్రకారం..ఈ బాక్టీరియాలో సాల్మొనెల్లా, ఇ.కోలి, షిగెల్లా, క్యాంపిలో బాక్టర్ అనే బ్యాక్టీరియాలు మన శరీరంలో ప్రవేశించి అనారోగ్యానికి గురి చేస్తాయి. 

►► ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ను వ్యాప్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించే ఈ ఫోన్‌ను టాయిలెట్‌లో వినియోగిస్తే గ్యాస్ట్రో, స్టాఫ్ వంటి వైరస్‌ల ఇతరకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. 

చదవండి👉  యాపిల్‌ లోగోను టచ్‌ చేసి చూడండి.. అదిరిపోద్దంతే..!

ఫోన్‌ నుంచి సురక్షితంగా ఉండాలంటే 

►► నిపుణుల అభిప్రాయం ప్రకారం 60% నీరు, 40% శానిటైజర్లతో ఫోన్‌ను శుభ్రం చేసుకోవాలి. మీ ఫోన్‌ను నేరుగా లిక్విడ్‌తో శుభ్రం చేయడం వల్ల డిస్‌ప్లే చెడిపోతుందని స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలు చెబుతున్నాయి.

►► ఫోన్‌ నుంచి సురక్షితంగా ఉండాలంటే  బాత్రూమ్‌లోకి తీసుకొని వెళ్లిపోకూడదు. తినేటప్పుడు ఫోన్‌ను వినియోగించపోవడం ఉత్తమం 

►► టచ్‌స్క్రీన్‌లను శుభ్రం చేయడానికి నిర్దిష్ట స్ప్రేలను కొనుగోలు చేయవచ్చు. స్క్రీన్ ప్రొటెక్ట్‌ చేసేందుకు సహాయ పడతాయి. 

►► బాత్రూమ్ నుండి బయటకు వచ్చినప్పుడు లేదా ఇతరుల స్మార్ట్‌ఫోన్‌ను తాకినప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. 

చదవండి👉  ‘ఆఫీస్‌కు రండి.. లేదంటే గెట్‌ ఔట్‌’!

మరిన్ని వార్తలు