భార్యాభర్తల మధ్య గొడవ! భ‌ర్త ఒక్క‌సారిగా..

25 Dec, 2023 09:04 IST|Sakshi

పటాన్‌చెరు: భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్‌పూర్‌ పరిధిలోని పటేల్‌గూడ బీఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన రాజుల ధర్మాంజనేయులు (38) పటాన్‌చెరు మండలం పాశంమైలారం పారిశ్రామిక వాడలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో కెమికల్‌ ఇంజనీర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం వారు ఉంటున్న ఇంటి మొదటి అంతస్తు నిర్మాణ ఖర్చుల విషయంలో భార్యాభర్తలు గొడవపడ్డారు.

ఆదివారం ఉదయం డ్యూటీ నుంచి వచ్చిన ధర్మాంజనేయులు పిల్లల బెడ్రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గది నుంచి ధర్మాంజనేయులు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో స్థానికుల సహకారంతో కుటుంబ సభ్యులు తలుపులు తీసి చూడగా ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య రాజుల నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ముఖ్య గమని​క: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

ఇవి చ‌ద‌వండి: వివాహానికై వ‌చ్చి ఆర్మీ జవాన్‌ తీవ్ర నిర్ణ‌యం! అస‌లు కార‌ణాలేంటి?

>
మరిన్ని వార్తలు