IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌!

11 Mar, 2022 18:48 IST|Sakshi

ఐపీఎల్‌-2022కు గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటిల్స్‌ స్టార్‌ పేసర్‌ అన్రిచ్‌ నోర్జే దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఢిల్లీ క్యాపిటిల్స్‌ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే నోర్జే స్ధానంలో ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ ఆండ్రూ టైను తీసుకోవాలని ఢిల్లీ క్యాపిటిల్స్‌ యాజమాన్యం భావిస్తోన్నట్లు సమాచారం. అతడితో పాటు ఆస్ట్రేలియా పేసర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌, భారత పేసర్‌ ఇషాంత్‌ శర్మ పేర్లు పరిశీలనలో ఉన్నప్పటకీ డిసీ యాజమాన్యం మాత్రం టై వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఐపీఎల్‌-2022 మెగా వేలంలో కోటి రూపాయల  కనీస ధరతో పేరు నమోదు చేసుకున్నాడు. కానీ అతడి పట్ల ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడంతో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. కాగా ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 27 మ్యాచ్‌లు ఆడిన టై.. 40 వికెట్ల పడగొట్టాడు. ఇక బిగ్‌బాష్‌ లీగ్‌లో కూడా టై అద్భుతంగా రాణించాడు. కాగా టై బాల్‌తోనే కాకుండా బ్యాట్‌తో కూడా రాణించగలడు. ఇక ఐపీల్‌-2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా జరగనున్న  తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తలపడనుంది. 

ఢిల్లీ క్యాపిటిల్స్‌ జట్టు:  రిషబ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్ నార్ట్జే, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, కుల్దీప్ యాదవ్, అశ్విన్ హెబ్బార్, అభిషేక్ శర్మ, కమలేష్ నాగర్‌కోటి, కేఎస్ భరత్, మన్‌దీప్ సింగ్, ఖలీల్ సద్కావ్, చేతన్ యాడ్కావ్, చేతన్ యాహ్మద్ , రిపాల్ పటేల్, యష్ ధుల్, రోవ్‌మన్ పావెల్, ప్రవీణ్ దూబే, లుంగి ఎన్‌గిడి, విక్కీ ఓస్త్వాల్, సర్ఫరాజ్ ఖాన్

చదవండి: తన చివరి మ్యాచ్ గురించి ముందే చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదు.. శ్రీశాంత్ ఆవేదన

మరిన్ని వార్తలు