అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు: డేనియల్ వెట్టోరి

9 May, 2022 17:31 IST|Sakshi
డేనియల్ వెట్టోరి

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాంపై న్యూజిలాండ్‌ మాజీ స్పిన్నర్ డేనియల్ వెట్టోరి ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌గా అజామ్‌ని వెట్టోరి  కొనియాడాడు. కాగా ఐసీసీ వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో బాబర్‌ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఇక ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బాబర్‌ అద్భుతంగా రాణించాడు. బాబర్ మూడు మ్యాచ్‌ల్లో 276 పరుగులు చేశాడు. 

"క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లు భిన్నంగా ఉంటాయి. మూడు ఫార్మాట్‌లలో ఒకే విధంగా రాణించాలంటే చాలా కష్టం. కానీ  బాబర్‌ ఆజాం మూడు ఫార్మాట్‌లలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే బాబర్‌ అత్యుత్తమ ఆటగాడు"అని ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెట్టోరి పేర్కొన్నాడు.

చదవండి: CSK VS DC: డెవాన్‌ కాన్వేను దిగ్గజ ఆటగాడితో పోలుస్తున్న నెటిజన్లు

మరిన్ని వార్తలు