NZ vs SL: ఇదేం బంతిరా బాబు.. బ్యాటర్‌ అస్సలు ఊహించి ఉండడు! వీడియో వైరల్‌

20 Mar, 2023 14:14 IST|Sakshi

వెల్లింగ్టన్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ 58 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ విజయ భేరి మోగించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో కివీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఫాలోఆన్ ఆడిన శ్రీలంక, తమ రెండో ఇన్నింగ్స్‌లో 358 పరుగులకి ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ, బ్లెయిర్ టిక్నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రెస్‌వేల్‌ రెండు, డాగ్‌ బ్రెస్‌వేల్‌ , హెన్రీ తలా వికెట్‌ సాధించారు. 

శ్రీలంక బ్యాటర్లలో ధనంజయ డి సిల్వా(98) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 123 ఓవర్లు బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలింది.

ఈ మ్యాచ్‌ నాలుగో రోజు ఆట సందర్భంగా ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది.  శ్రీలంక ఇన్నింగ్స్‌ 121 ఓవర్‌ వేసిన స్పిన్నర్‌ మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో ఓ బంతి.. భారీ గాలుల కారణంగా ఆనూహ్యంగా టర్న్‌ అయ్యి వైడ్‌గా వెళ్లింది. అతడు బౌలింగ్‌ వేసే సమయంలో ఒక్క సారిగా గాలి రావడంతో.. బంతి పిచ్‌కు చాలా దూరంగా పడింది.

ఇది చూసిన శ్రీలంక బ్యాటర్‌ ఆశ్చర్యానికి గురయ్యాడు.  ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గత కొన్ని రోజులగా న్యూజిలాండ్‌లో భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
చదవండి: SL vs NZ: డబ్ల్యూటీసీ ఫైనల్‌ కాదు.. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా! శ్రీలంకను చిత్తు చేసిన కివీస్‌

మరిన్ని వార్తలు