Balloon World Cup: బెలూన్‌ వరల్డ్‌కప్‌.. క్రీడాకారిణి ప్రాణం మీదకు

11 Oct, 2022 09:04 IST|Sakshi

బెలూన్‌ వరల్డ్‌కప్‌ ఒక క్రీడాకారిణి ప్రాణం మీదకు తెచ్చింది. సరదాగా మొదలైన ఆట ఆఖర్లో కాస్త ఉత్కంఠను రేపింది. విషయంలోకి వెళితే.. ట్విచ్‌కాన్‌ 2022 పేరిట అక్టోబర్‌ 8న సాన్‌ డీగోలో బెలూన్‌ వరల్డ్‌కప్‌ నిర్వహించారు. ఈ గేమ్‌లో చాలా మంది పాల్గొన్నారు.

బెలూన్‌ గేమ్‌ అంటే ఏంటి?
గాలిలోకి ఎగిరిన బెలూన్‌ కిందపడకుండా చేతితోనే కొడుతుండాలి. ఒక్కో రౌండ్‌ రెండు నిమిషాల పాటు ఆడాలి. ఈ క్రమంలో ఆటలో పాల్గొన్న క్రీడాకారుల్లో ఒకరినొకరు చేజ్‌ చేస్తూ ఎవరు ఎక్కువసేపు బెలూన్‌ను గాలిలోకి కొట్టగలిగితే వారిని విజేతగా నిర్ణయిస్తారు. ఇది క్లుప్తంగా బెలూన్‌ వరల్డ్‌కప్‌ గేమ్‌.

కాగా బెలూన్‌ వరల్డ్‌కప్‌లో ట్విచ్‌ స్రీమర్‌ జుమ్మెర్స్‌ కూడా పాల్గొంది. జుమ్మెర్స్‌ ఇదివరకు చాలాసార్లు బెలూన్‌ గేమ్స్‌లో విజయాలు అందుకొని ఫెవరెట్‌గా మారిపోయింది. ఆమెకు అభిమాన దళం కూడా ఎక్కువే. ఇక మ్యాచ్‌లో జుమ్మెర్స్‌ ఆద్యంతం ఆధిపత్యం చెలాయిస్తూ చాలావరకు బెలూన్‌ను గాల్లోనే ఉంచింది. అయితే మరికొద్ది సెకన్లలో ఆట ముగుస్తుందనగా ఆమె సోఫాలో నుంచి జారి కింద పడింది.

తల భాగం గట్టిగా తగలడంతో పెద్ద గాయం అయిందని అంతా భావించారు. కానీ జుమ్మెర్స్‌ కుడి చీలమండకు మాత్రం తీవ్ర గాయమైంది. వెంటనే నిర్వహాకులు ఆమెను స్ట్రెచర్‌పై తీసుకెళ్లి చికిత్స అందించారు. మూడువారాలు రెస్ట్‌ తీసుకుంటే కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను ట్విచర్‌ జుమ్మెర్స్‌ కోరిక మేరకు తొలగించారు. ఇక జుమ్మెర్స్‌ గాయపడడంపై ఆమె అభిమానులు ట్విటర్‌ వేదికగా త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు.

చదవండి: ఏదైనా సాధిస్తేనే ఇంటికి రా..' 

>
మరిన్ని వార్తలు