Asia Cup Squad: సుందర్‌ను మరిచారా.. కావాలనే పక్కనబెట్టారా!

11 Aug, 2022 10:37 IST|Sakshi

టీమిండియా స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 2020 చివర్లో ఆస్ట్రేలియా గడ్డపై సుందర్‌ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో సుందర్‌(62 పరుగులు).. శార్దూల్‌ ఠాకూర్‌తో కలిసి ఆడిన ఇన్నింగ్స్‌ ఎవరు మరిచిపోలేరు. ఒక రకంగా నాలుగో టెస్టులో టీమిండియా గెలిచిందంటే సుందర్‌ది కీలకపాత్ర అని చెప్పొచ్చు.

ఆ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్నప్పటికి గాయాల కారణంగా క్రమేపీ జట్టుకు దూరమయ్యాడు. అయితే జట్టులో సరైన అవకాశాలు లేక ప్రస్తుతం కౌంటీ క్రికెట్‌లో బిజీగా గడుపుతున్నాడు. రానున్న టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ఆసియా కప్‌కు ఎంపిక చేసిన జట్టులో సుందర్‌ ఎంపిక కాలేదు. స్పిన్నర్లుగా రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయి, యజ్వేంద్ర చహల్‌లు ఉన్నారు.

కాగా ఆసియా కప్‌కు సుందర్‌ను ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ సెలెక్టర్లలో ఒకరు క్లారిటీ ఇచ్చారు.‘సుందర్‌‌‌‌ టీమిండియాకు చాలా గొప్ప ఆస్తి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ను మెరుగుపర్చుకోవాలి. అవకాశం కోసం వెయిట్‌‌‌‌ చేయాల్సిందే. ఈ విషయాన్ని సుందర్‌‌‌‌తో చర్చించాం. ఆసీస్‌‌‌‌ పిచ్‌‌‌‌లకు అశ్విన్‌‌‌‌ సరిపోతాడని అనుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా గాయపడితే అప్పుడు సుందర్‌‌‌‌ బ్యాకప్‌‌‌‌గా వస్తాడు’ అని ఓ సెలెక్టర్‌‌‌‌ వ్యాఖ్యానించాడు.

గాయం కారణంగా చాలా రోజులుగా ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌కు దూరంగా ఉన్న సుందర్‌‌‌‌.. ఇటీవలే కౌంటీల్లో సూపర్‌‌‌‌ ఎంట్రీ ఇచ్చాడు. లాంక్​షైర్‌‌‌‌ తరఫున రెండు ఫస్ట్‌‌‌‌ క్లాస్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో 8 వికెట్లు తీశాడు. మొత్తానికి ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ లేకపోవడం, ఐపీఎల్‌‌‌‌ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌‌‌‌లు ఆడకపోవడం, టీమ్‌‌‌‌లో పోటీ పెరగడం, ఆసీస్‌‌‌‌ పిచ్‌‌‌‌లు అతని బౌలింగ్‌‌‌‌కు సరిపోకపోవడం వంటి నాలుగు అంశాలతో సెలెక్టర్లు సుందర్‌‌‌‌ను పక్కనబెట్టారు. ఇక ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. టీమిండియాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.

మెగా ఈవెంట్‌‌‌‌కు బలమైన టీమ్‌‌‌‌ను బరిలోకి దించాలని భావిస్తున్నా.. యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ నుంచి సెలెక్టర్లకు  పెద్ద సవాలే ఎదురవుతున్నది. ఈ మధ్య కాలంలో సీనియర్లు లేకపోయినా.. యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌తో కూడిన టీమిండియా వరుసగా సిరీస్‌‌‌‌లు గెలిచింది. దీంతో ఆసీస్‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌లో ఎవరికి బెర్త్‌‌‌‌ కేటాయించాలన్న దానిపై సెలెక్షన్‌‌‌‌ కమిటీ ఓ కొలిక్కి రాలేకపోతున్నది. తాజాగా ఆసియా కప్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌తో దీనిపై తుది నిర్ణయానికి రావాలని సెలెక్టర్లు  భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెలెక్టర్ల నుంచి ఒకటి, రెండు స్పష్టమైన సంకేతాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా  స్పిన్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌గా పనికి వస్తాడనుకున్న వాషింగ్టన్‌‌‌‌ సుందర్‌‌‌‌ను.. టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ టీమ్‌‌‌‌ ప్రణాళికల నుంచి తప్పించాలని సెలెక్టర్లు నిర్ణయానికి వచ్చేశారు.

అదే సమయంలో వెటరన్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ అశ్విన్‌‌‌‌కు ఆసీస్‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌లో చోటు కల్పించాలని భావిస్తున్నారు. టీమిండియాలో స్పిన్నర్‌‌‌‌గా అశ్విన్‌‌‌‌కు చాలా అనుభవం ఉంది. ఆసీస్‌‌‌‌ పిచ్‌‌‌‌లు ఎక్కువగా పేసర్లకు సహకరిస్తాయి. అదే సమయంలో అశ్విన్‌‌‌‌ స్పిన్‌‌‌‌ కూడా ప్రభావవంతంగా పని చేస్తుందని సెలెక్టర్లు నమ్ముతున్నారు. జడేజా, చహల్‌‌‌‌ను తీసుకున్నా.. అశ్విన్‌‌‌‌ టీమ్‌‌‌‌లో ఉండటం వల్ల స్పిన్​లో వైవిధ్యం ఉంటుందని భావిస్తున్నారు. అనుభవం పక్కనబెడితే మ్యాచ్‌‌‌‌ను అవగాహన చేసుకోవడంలో అశ్విన్​ దిట్ట. దీనికి తోడు డిఫరెంట్‌‌‌‌ బాల్స్‌‌‌‌ వేయడంలో స్పెషలిస్ట్‌‌‌‌. ఆసీస్‌‌‌‌ పిచ్‌‌‌‌లపై బాల్‌‌‌‌ టర్నింగ్‌‌‌‌ లేకపోయినా.. మంచి వేరియేషన్స్‌‌‌‌తో బ్యాటర్లను ఇబ్బందిపెడతాడని యోచిస్తున్నారు. అదే సమయంలో యంగ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ రవి బిష్ణోయ్‌‌‌‌ నుంచి అశ్విన్‌‌‌‌కు పోటీ ఎదురయ్యే చాన్స్‌‌‌‌ కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో  ఆసియా కప్‌‌‌‌లో ఈ ఇద్దరి  ఆటను సెలెక్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు.

చదవండి: Ishan Kishan: ఎంపిక చేయలేదన్న కోపమా?.. పాట రూపంలో నిరసన

Asia Cup 2022: టీమిండియా సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు అదే! టాప్‌ స్కోరర్లను వదిలేసి..

మరిన్ని వార్తలు