ఇంగ్లండ్‌ జట్టుకు గుడ్‌ న్యూస్.. స్టార్ ఆల్ రౌండర్ రెడీ

25 Oct, 2021 21:03 IST|Sakshi

Ben Stokes Added To England Squad For Ashes Series: యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టుకు శుభవార్త అందింది. స్టార్‌ ఆల్‌ రౌండర్‌ బెన్ స్టోక్స్ నాలుగున్నర నెలల విరామం తర్వాత టెస్ట్‌ జట్టుకు ఎంపికయ్యాడు. గత కొంత కాలంగా చేతి వేలి గాయం, మానసిక సమస్యలతో సతమతమవుతున్న స్టోక్స్‌.. ఇటీవలే కోలుకున్నట్లు ప్రకటించాడు. దీంతో నవంబర్ 4న ఆస్ట్రేలియాకు బయలుదేరనున్న ఇంగ్లీష్‌ జట్టుతో అతను చేరనున్నాడు. స్టోక్స్‌ చివరిసారిగా జులైలో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడాడు. కాగా, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ డిసెంబర్‌ 8 నుంచి మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇరు జట్లు 5 టెస్ట్‌ల్లో తలపడనున్నాయి.

ఇంగ్లండ్‌ జట్టు: జో రూట్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, డామ్ బెస్, రోరీ బర్న్స్, స్టువర్ట్ బ్రాడ్, జోస్ బట్లర్, జాక్ క్రావ్లీ, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, డేవిడ్ మలాన్, క్రెగ్ ఓవర్టన్, ఓల్లీ పోప్, ఓల్లీ రాబిన్‌సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్
చదవండి: అలాంటి మిస్టరీ బంతులను పాక్‌లో గల్లీ పోరలు రోజూ ఎదుర్కొంటారు..!

మరిన్ని వార్తలు