World Cup 2023: వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌..

28 Sep, 2023 12:12 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌ రౌండర్‌  అష్టన్ అగర్‌ గాయం కారణంగా వరల్డ్‌కప్‌ టోర్నీకి దూరం కానున్నట్లు తెలుస్తోంది. అగర్‌ ప్రస్తుతం కాలి కండరాల గాయంతో బాధపడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో అగర్‌కు గాయమైంది.

అదే విధంగా తన భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వడంతో ప్రోటీస్‌ సిరీస్‌ మధ్యలోనే అగర్‌ స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో భారత్‌తో వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఇక ఆస్ట్రేలియాకు చెందిన 'ది డైలీ టెలిగ్రాఫ్' వార్తాపత్రిక నివేదిక ప్రకారం.. అగర్‌ తన గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టనన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే భారత్‌ వేదికగా జరిగే ప్రధాన టోర్నీకి అతడు దూరం కానున్నట్లు సమాచారం. ఇక ఆగర్‌ స్ధానంలో ఆల్‌రౌండర్‌ మాథ్యూ షార్ట్‌ లేదా స్పిన్నర్‌ తన్వీర్‌ సంగాను క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎంపిక చేసే అవకాశం ఉంది.

ఇక ఇప్పటికే స్టార్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ వరల్డ్‌కప్‌కు దూరం కాగా.. ఇప్పుడు అగర్‌ కూడా దూరమైతే ఆసీస్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 8న టీమిండియాతో తలపడనుంది.
చదవండి: World Cup 2023: 'ఈ డర్టీ గేమ్‌లో నాకు ఆడాలని లేదు.. కావాలనే నన్ను తప్పించారు'

మరిన్ని వార్తలు