సింగిల్‌ వికెట్‌​ స్టంప్‌తో అన్ని రకాల షాట్లు ఆడేశాడు

8 May, 2021 20:58 IST|Sakshi

ముంబై: సాధారణంగా ఒక బ్యాట్స్‌మన్‌ ఒక మ్యాచ్‌లో క్రికెట్‌లోని అన్ని షాట్లు ఆడే ఘటనలు అరుదుగా చోటుచేసుకుంటాయి. కానీ ఇక్కడ ఒక కుర్రాడు మాత్రం కేవలం ఒక వికెట్‌ స్టంప్‌తో అన్ని రకాల షాట్లను ఆడడం వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఒక కుర్రాడు తన ప్రాక్టీస్‌లో భాగంగా సింగిల్‌ వికెట్‌ స్టంప్‌తో బ్యాటింగ్‌ ఇరగదీశాడు. క్రికెట్‌లో ఉన్న డ్రైవ్‌, స్వీప్‌, రాంప్‌, ఫ్లిక్‌ ఇలా ఏ షాటైనా తనదైన స్టైల్‌లో ఆడేశాడు. ముఖ్యంగా క్రీజులో నిలబడి ఆడిన స్ట్రెయిట్‌ డ్రైవ్‌, కవర్‌ డ్రైవ్‌ షాట్లు తనలోని సొగసరి ఆటతో పాటు లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ను గుర్తుచేశాయి.

ఇక బ్యాక్‌వర్డ్‌ దిశగా ఆడే క్రమంలో ఒక కాలిపై నిల్చుని కొట్టిన షాట్‌ ఏబీ డివిలియర్స్‌, మ్యాక్స్‌వెల్‌ను గుర్తుకు తెస్తాయడనంలో సందేహం లేదు. మొత్తానికి తన ఆటతీరుతో ఈ బుడతడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రేడ్‌ క్రికెటర్‌ అనే సంస్థ దీనిని ట్విటర్‌లో షేర్‌ చేసింది. వీలైతే మీరు ఓ లుక్కేయండి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ''ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంది.. వారెవ్వా.. క్రికెట్‌లోని అన్ని రకాల షాట్లు ఆడేశాడు..'' అంటూ కామెంట్‌ చేశారు.
చదవండి: ఆర్చర్‌ బనానా ఇన్‌స్వింగర్‌.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్‌

'సామ్‌ ఇంటికెళ్లి బాగా చదువుకో'.. రైనా ట్రోల్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు