కెప్టెన్‌గా కోహ్లి చేసిన ఆ తప్పిదాలతోనే..!

29 Nov, 2020 19:25 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఇంకా మ్యాచ్‌ ఉండగానే కోల్పోయింది. దాంతో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై మళ్లీ విమర్శలు వస్తున్నాయి. ఒక కెప్టెన్‌గా కోహ్లి సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో చేసిన తప్పిదాలే చేశాడు. తొలి వన్డేలో చేసిన కొన్ని పొరపాట్లను  కోహ్లి మళ్లీ రిపీట్‌ చేశాడు. తొలి వన్డేలో 66 పరుగుల తేడాతో పరాజయం చెందిన టీమిండియా..రెండో వన్డేలో 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.  ఈ మ్యాచ్‌లో  ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 389 పరుగులు చేయగా, టీమిండియా 338 పరుగులు మాత్రమే చేసింది. అసలు ఎంతో ఉత్సాహంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా భారీ స్కోర్లు సమర్పించుకుని సిరీస్‌ను కోల్పోవడంతో కోహ్లి తప్పిదాలు వార్తల్లో నిలిచాయి. (పోరాడి ఓడిన టీమిండియా..)

సైనీకి మళ్లీ చాన్స్‌
తొలి వన్డేలో భారీ పరుగులు సమర్పించుకున్న పేసర్‌ నవదీప్‌ సైనీని రెండో వన్డేలో ఆడించడానికే కోహ్లి మొగ్గుచూపాడు. తొలి వన్డేలోనే సైనీ అనవసరం అనే వాదన వినిపించిన తరుణంలో రెండో వన్డేలో కూడా అతన్నే కొనసాగించాడు కోహ్లి.  ఈ మ్యాచ్‌లో కనీసం నటరాజన్‌, శార్దూల్‌ ఠాకూర్‌లలో ఒకరి మూడో స్పెషలిస్టు పేసర్‌గా తీసుకుంటారని అనుకున్నా అది జరగలేదు. సైనీతో ఉన్న ఎక్కువ అనుబంధంతో అతన్నే కొనసాగించాడు కోహ్లి. కానీ ఈ పేసర్‌ 7 ఓవర్లలో  వికెట్‌ మాత్రమే సాధించి 70 పరుగులిచ్చాడు. సైనీని మళ్లీ ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఆడేసుకోవడంతో పూర్తిగా కోటాను వేయలేకపోయాడు సైనీ. నవదీప్‌ సైనీని ఆదిలోనే బాదేయడంతో అతన్ని 34 ఓవర్‌
వేసిన తర్వాత కోహ్లి ఆపేశాడు.  ఆపై అతనికి చివరి ఓవర్‌ వేసే అవకాశన్ని మాత్రమే ఇచ్చాడు కోహ్లి. అంటే ఒక స్పెషలిస్టు పేసర్‌ చేత పూర్తిగా బౌలింగ్‌ వేయించే పరిస్థితి ఇక్కడ లేకుండా పోయింది. 

హర్దిక్‌ను లేట్‌ చేశాడు..
హార్దిక్‌ పాండ్యాకు వెన్నుగాయం తర్వాత బౌలింగ్‌ చేయడం ఇదే తొలిసారి. ఎప్పుట్నుంచో బౌలింగ్‌కు దూరంగా ఉంటున్న హార్దిక్‌.. ఆసీస్‌తో రెండో వన్డేలో బౌలింగ్‌ చేసి ఆకట్టుకున్నాడు. కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేసిన హార్దిక్‌ 24 పరుగులిచ్చి వికెట్‌ తీశాడు. కానీ హార్దిక్‌కు బౌలింగ్‌ ఇచ్చే విషయంలో చాలా ఆలస్యం చేశాడు కోహ్లి. హార్దిక్‌ చేతికి 36 ఓవర్‌లో బౌలింగ్‌ ఇచ్చాడు.ఆరు పరుగుల ఎకానమీతో ఆకట్టుకున్న హార్దిక్‌.. స్టీవ్‌ స్మిత్‌ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.   ఒకవేళ హార్దిక్‌ చేత ముందే బౌలింగ్‌ వేయించుంటే పరిస్థితి మరోలా ఉండేది.  తొలి వన్డేలో హార్దిక్‌ చేత బౌలింగ్‌ చేయించలేకపోయమని బాధపడిన కోహ్లి.. ఈ మ్యాచ్‌లో అతని చేత నాలుగు ఓవర్లే వేయించడమే ప్రశ్నార్థకంగా మారింది. 

తరచు బౌలింగ్‌ మార్పులు
ఈ మ్యాచ్‌లో బుమ్రా, షమీ, సైనీ, రవీంద్ర జడేజా, చహల్‌, హార్దిక్‌ పాండ్యాలతో పాటు మయాంక్‌ అగర్వాల్‌ కూడా బౌలింగ్‌ చేశాడు. ప్రధానంగా కోహ్లి బౌలింగ్‌ను తరచు మార్చుతూ కనిపించాడు. మ్యాచ్‌ మధ్య భాగంలో బౌలర్ల చేత కంటిన్యూ స్పెల్‌ చేయించకుండా మార్చి మార్చి బౌలింగ్‌ వేయించి ఆసీస్‌ను ఇబ్బంది పెట్టాలనుకున్నాడు కోహ్లి. కానీ బెడిసి కొట్టింది. బౌలర్ల చేత కంటిన్యూ స్పెల్‌ చేయిస్తే వారికి పిచ్‌పై పట్టుదొరికి వికెట్లు సాధించడానికి ఆస్కారం దొరుకుతుంది. ఇక్కడ ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ క్రీజ్‌లో సెటిల్‌ కావడానికి బౌలింగ్‌ ఛేంజ్‌ చేస్తూ పోవడం కారణంగా చెప్పవచ్చు. 

మరిన్ని వార్తలు