వైరల్‌ : రొనాల్డో నైటీ వేసుకున్నాడా?

16 Sep, 2020 13:00 IST|Sakshi

లిస్బన్‌ : క్రిస్టియానో రొనాల్డో.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫుట్‌బాల్‌ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. సోషల్‌ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్‌ కలిగిన దిగ్గజ ఆటగాడిగా రొనాల్డో రికార్డు సృష్టించాడు. తాజాగా వెల్లడించిన ఫోర్బ్స్‌ జాబితాలో పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో 11 కోట్ల 70 లక్షల డాలర్ల (దాదాపు రూ. 860 కోట్లు) ఆర్జనతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇటలీలో యువెంటస్‌ క్లబ్‌కు ఆడుతున్న రొనాల్డో వేతనం ద్వారా 70 కోట్ల డాలర్లు... ఎండార్స్‌మెంట్ల ద్వారా 47 కోట్ల డాలర్లు పొందుతున్నాడు.రొనాల్డో..  పోర్చుగల్‌ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూనే ఫుట్‌బాల్‌ క్లబ్‌ లీగ్స్‌కు ఆడుతూ ప్రపంచవ్యాప్త అభిమానులను సంపాదించాడు. (చదవండి : 'రోహిత్‌ ఇది‌​ నాది.. వెళ్లి సొంత బ్యాట్‌ తెచ్చుకో')

తాజాగా రొనాల్డో తన ట్విటర్‌లో ఒక ఫోటోను షేర్‌ చేశాడు. 2వేల పౌండ్ల( రూ. కోటి 80 లక్షలు) ధర కలిగిన లూయిస్‌ సిల్క్‌ డ్రెస్‌ సెట్‌ వేసుకొని..  దాదాపు 5.5 మిలియన్‌ పౌండ్ల(రూ. 40 కోట్లు) ధర పెట్టి కొనుగోలు చేసిన తన క్రూసింగ్‌ షిప్‌లో దిగిన ఫోటోను ట్విటర్‌లో పెట్టాడు. షిప్‌ బాల్కనీలో కూర్చొని సన్‌సెట్‌ను ఆస్వాధిస్తూ 'వాట్‌ ఏ బ్యూటిఫుల్‌ సీనరీ' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు రొనాల్డో పెట్టిన ఫోటోలపై నెటిజన్లు తెగ ట్రోల్‌ చేస్తున్నారు. ఎంజాయ్‌ చేస్తున్నా అని క్యాప్షన్‌ పెట్టిన రొనాల్డో ముఖంలో మాత్రం ఆ సంతోషం కనబడటం లేదని నెటిజన్లు వాపోయారు. తన ముఖం చూస్తే ఏదో బాధతో కుమిలిపోతున్నట్లు కనిపిస్తుంది. ఫోటోకు ఫోజిచ్చినప్పుడు కనీసం నవ్వాలన్న సోయి కూడా రొనాల్డోకు లేదు.. ఇదేం ఎంజాయ్‌మెంటో మాకు అర్థం కావడం లేదు అంటూ కామెంట్లు పెట్టారు.

రొనాల్డో ట్వీట్‌ చూసి కొంతమంది మరింత ముందుకెళ్లి.. 'ఇదేంటీ మమ్మీ.. రొనాల్డో  నీ నైటీ ఎందుకు ఎందుకు వేసుకున్నాడు.. అచ్చం జైలు నుంచి పారిపోయిన ఖైదీలా కనిపిస్తున్నావు.. రొనాల్డో మా హార్ట్‌ బ్రేక్‌ చేశావు.. రొనాల్డో.. నీ డ్రెస్‌ సెన్స్‌ అస్సలు బాగాలేదు..' అంటూ వరుస ట్వీట్లతో ట్రోల్‌ చేశారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా