IPL 2023: శార్దూల్ ఠాకూర్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ గుడ్‌బై!

27 Oct, 2022 10:24 IST|Sakshi

ఐపీఎల్‌-2023కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్‌-16న ఇస్తాంబల్‌ వేదికగా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ డిసెంబర్‌ 16న వేలం జరినట్లయితే.. నవంబరు 15లోపు టోర్నీలోని 10 ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది.  ఈ క్రమంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ శార్దూల్ ఠాకూర్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ ఏడాది మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్‌ను 10.75 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసింది. కాగా ఈ ఏడాది సీజన్‌లో ఠాకూర్‌ అంతగా రాణించలేకపోయాడు. 14 మ్యాచ్‌లు ఆడిన ఠాకూర్‌.. 15 వికెట్లతో పాటు 120 పరుగులు సాధించాడు.

క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. ఠాకూర్‌తో పాటు బ్యాటర్లు వికెట్‌ కీపర్‌ కెఎస్‌ భరత్‌,  మన్‌దీప్ సింగ్‌కు కూడా ఢిల్లీ గుడ్‌బై చెప్పనుంది.  కాగా ఆంధ్ర ఆటగాడు కెఎస్‌ భరత్‌కు ఈ ఏడాది సీజన్‌లో పెద్దగా అవకాశాలు దక్కలేదు. కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన భరత్‌.. 18 పరుగులు సాధించాడు.
చదవండి: IND vs NED: నెదర్లాండ్స్‌ జట్టులో వాళ్లతో జాగ్రత్త.. లేదంటే అంతే సంగతి?

మరిన్ని వార్తలు