NED vs ENG: వన్డేల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌.. 498 పరుగుల భారీ స్కోర్‌

17 Jun, 2022 20:10 IST|Sakshi

వన్డేల్లో ఇంగ్లండ్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్‌ను ఇంగ్లండ్‌ నమోదు చేసింది. ఆమ్స్టెల్వీన్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరగిన తొలి వన్డేలో ఇంగ్లండ్‌ 4 వికెట్లు కోల్పోయి 498 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది. తద్వారా వన్డే క్రికెట్‌ చరిత్రలో తన పేరిట ఉన్న అత్యధిక స్కోర్‌ రికార్డును ఇంగ్లండ్‌ అధిగమించింది. అంతకుముందు 2018లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌పై 481 పరుగులు చేసింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఆదిలోనే ఓపెనర్‌ రాయ్‌(1) వికెట్‌ కోల్పోయింది.

అనంతరం ఫిలిప్‌ సాల్ట్‌(122), డేవిడ్‌ మలాన్‌(125)తో కలిసి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. మలన్‌, సాల్ట్‌ రెండో వికెట్‌కు 170 బంతుల్లో 222 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. సాల్ట్‌ ఔటయ్యక క్రీజులోకి వచ్చిన బట్లర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచకుపడ్డాడు. ఈ క్రమంలోనే బట్లర్‌ కేవలం 47 బంతులలోనే సెంచరీ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో 70 బంతులలో 162 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు,14 సిక్స్‌లు ఉన్నాయి. అదే విధంగా విడ్‌ మలన్‌ (125) పరుగులతో రాణించాడు. ఇక అఖరిలో లివింగ్‌ స్టోన్‌(66 నాటౌట్‌; 22 బంతుల్లో 6x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తం 26 సిక్సర్లు, 36 బౌండరీలు నమోదయ్యాయి.
చదవండి: Tim Paine Thanks Rahane: 'థాంక్యూ రహానే.. కోహ్లిని రనౌట్‌ చేయకుంటే గెలిచేవాళ్లం కాదు'

మరిన్ని వార్తలు