ENG vs SA: ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన దక్షిణాఫ్రికా యువ ఆటగాడు.. ఫుల్‌ జోష్‌లో ముంబై!

28 Jul, 2022 17:36 IST|Sakshi

బుధవారం బ్రిస్టల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా 41 పరుగుల తేడాతో ఓటమి చెందింది. అయితే ప్రోటిస్ పరాజయం పాలైన ప్పటికీ ఆ జట్టు యువ ఆల్‌ రౌండర్‌ ట్రిస్టన్ స్టబ్స్ మాత్రం ఇంగ్లండ్‌కు వణుకు పుట్టించాడు. 21 ఏళ్ల స్టబ్స్  కేవలం 28 బంతుల్లోనే 72 పరుగులు సాధించి ఇంగ్లండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా తరపున ఇంగ్లండ్‌పై అర్ధశతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా స్టబ్స్  నిలిచాడు.

ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. బెయిర్‌ స్టో(90), మొయిన్‌ అలీ(52) పరుగులతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 234 పరుగులు చేసింది. అనంతరం 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటిస్‌ 86 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన స్టబ్స్ ఇంగ్లండ్‌ బౌలర్లను ఊచకోత కోశాడు.  స్టుబ్స్ చెలరగేడంతో ఇంగ్లండ్ ఒక దశలో ఓడిపోయేలా కనిపించింది.

అయితే గ్లెసిన్‌ బౌలింగ్‌ స్టబ్స్‌ ఔట్‌ కావండంతో విజయం ఇంగ్లండ్‌ సొంతమైంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు  స్టబ్స్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్‌ మధ్యలో గాయపడిన టైమల్‌ మిల్స్‌ స్థానంలో స్టబ్స్‌ను ముంబై భర్తీ చేసుకుంది. కాగా ఒకటెండ్రు మ్యాచ్‌ల్లో అవకాశం లభించినా స్టబ్స్‌ ఉపయోగించుకోలేకపోయాడు. అయితే వచ్చే ఏడాది సీజన్‌లో మాత్రం స్టబ్స్‌ దుమ్ము రేపుతాడని అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. స్టబ్స్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌తో ముంబై ఫుల్‌ జోష్‌లో ఉంటుందని మరి కొంత మంది అభిప్రాయపడుతున్నారు.
చదవండి: ENG vs SA: టీ20‍ల్లో మొయిన్‌ అలీ అరుదైన రికార్డు.. ఇంగ్లండ్‌ తొలి ఆటగాడిగా!

>
మరిన్ని వార్తలు