దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌కు క్లీన్‌చిట్‌

26 Apr, 2022 05:15 IST|Sakshi

జాతి వివక్ష ఆరోపణల నుంచి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌కు విముక్తి లభించింది. అతనితో పాటు ప్రస్తుత కోచ్, మాజీ వికెట్‌ కీపర్‌ మార్క్‌ బౌచర్, ఏబీ డివిలియర్స్‌లకు కూడా క్లీన్‌చిట్‌ ఇచ్చారు. స్మిత్‌ తదితరులు జట్టులోని నల్లజాతి క్రికెటర్లపై వివక్షకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు లభించలేదని... ఎన్‌సెబెజా నేతృత్వంలోని సోషల్‌ జస్టిస్‌ అండ్‌ నేషన్‌ బిల్డింగ్‌ కమిటీ తమ నివేదికలో పేర్కొంది.

మరిన్ని వార్తలు