టైం లేదని గ్రౌండ్‌లోనే పని కానిచ్చాడు

31 Jan, 2021 19:20 IST|Sakshi

కాన్‌బెర్రా: బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌ 10)లో భాగంగా ఆదివారం సిడ్నీ థండర్స్‌, బ్రిస్బేన్‌ హీట్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సిడ్నీ థండర్స్‌ బ్యాటింగ్‌ సమయంలో ఆ జట్టు ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖాజా చేసిన ఒక పని సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. అసలు విషయంలోకి వెళితే.. సిడ్నీ ఇన్నింగ్స్‌ సమయంలో 9వ ఓవర్‌ తర్వాత కొన్ని నిమిషాల పాటు బ్రేక్‌ లభించింది. ఇదే సమయంలో ఖాజా తన అండర్‌గార్మెంట్‌లో  గార్డ్‌ సమస్యగా మారడంతో డ్రెస్సింగ్‌ రూమ్‌కు కాల్‌ ఇచ్చాడు. అయితే వారు వచ్చేలోపే ఖాజా తన ప్యాంటును విప్పి తన అండర్‌గార్డ్‌ను తొలగించి దానిని సరిచేసే పనిలో పడ్డాడు. అంతలో సిబ్బంది అతని వద్దకు వచ్చి కొత్త గార్డ్‌ అందించడంతో దాన్ని వేసుకొని మళ్లీ యధావిథిగా ఆటను ప్రారంభించాడు.

అయితే ఖాజా చర్యతో మైదానంలోని ప్రత్యర్థి ఆటగాళ్లతో పాటు అంపైర్లు, ప్రేక్షకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఖాజాకు సంబంధించిన వీడియోనూ సెవెన్‌ క్రికెట్‌ డాట్‌కామ్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. క్రికెట్‌లో ఇలాంటి సీన్‌ మీరు ఎప్పుడు చూసి ఉండరు.. అందరూ చూస్తుండగానే ఖాజా గ్రౌండ్‌లోనే పని కానిచ్చేశాడు అంటూ లాఫింగ్‌ ఎమోజీతో క్యాప్షన్‌ జత చేసింది. ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారి నవ్వులు పూయిస్తుంది. చదవండి: థ్యాంక్స్‌ మోదీ జీ.. టీమిండియా ఎమోషనల్‌ ట్వీట్‌

 ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. బ్రిస్బేన్‌ హీట్‌.. సిడ్నీ థండర్స్‌పై 7 వికెట్లతో విజయాన్ని అందుకొని ఫైనల్‌ బెర్తుకు మరింత దగ్గరైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ థండర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. కటింగ్‌ 34, బిల్లింగ్స్‌ 34 పరుగులతో రాణించారు. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిస్బేన్‌ హీట్‌ 3 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. సామ్ హీజ్లెట్ 74 నాటౌట్‌ టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. జిమ్మీ పియర్సన్‌ 43 పరుగులతో రాణించాడు.చదవండి: కళ్లు చెదిరే సిక్స్‌.. కొడితే అవతల పడింది

మరిన్ని వార్తలు