'గిల్‌ తల దించుకొని ఆడితే బాగుంటుంది'

26 Jan, 2021 16:27 IST|Sakshi

ఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌పై ఒ‍త్తిడి పెంచడం అంత మంచిది కాదు.. అలా చేస్తే అతని కెరీర్‌ ప్రమాదంలో పడుతుందని మాజీ ఆటగాడు గౌతం గంభీర్‌ పేర్కొన్నాడు. ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న గిల్‌ ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్‌ సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు.

గిల్‌ విషయమై గంభీర్‌ మాట్లాడుతూ..' ముందుగా గిల్‌కు నా అభినందనలు. సీనియర్‌ ఆటగాళ్ల గైర్హాజరీలో కేవలం యువ జట్టుతోనే టీమిండియా సిరీస్‌ గెలవడం సంతోషించదగ్గ విషయం. ఇక గిల్‌ విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో రోహిత్‌ శర్మతో కలిసి కచ్చితంగా ఓపెనింగ్‌ చేస్తాడు.. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అతను అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగుపెట్టాడు. ఒక్క సిరీస్‌లోనే రాణించాడని అతనిపై ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు..  అతనిపై అనవసర ఒత్తిడి పెడితే కెరీర్‌ దెబ్బతినే అవకాశం ఉంది. గిల్‌కు మంచి టాలెంట్‌ ఉంది.. ఆ విషయం నేను ఒప్పుకుంటా.. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో స్థిరమైన ప్రదర్శన చేసేవరకు గిల్‌ అనవసర ఆర్బాటాలకు పోకుండా తల దించుకొని ఆడితే బాగుంటుంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్‌ చాలా టఫ్‌గా ఉంటుంది.'అని చెప్పుకొచ్చాడు. చదవండి: అతన్ని కొనుగోలు చేసేముందు ఆలోచించండి'

కాగా ఆసీస్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో శుబ్‌మన్‌ గిల్‌ మూడు టెస్టు మ్యాచ్‌లాడి 259 పరుగులు చేశాడు. ముఖ్యంగా నాలుగో టెస్టు జరిగిన గబ్బా మైదానంలో గిల్‌ 91 పరుగుల కీలకఇన్నింగ్స్‌ టీమిండియా విజయానికి బాటలు వేసిందన్న విషయం ఎవరు మరిచిపోలేరు. ఇక ఫిబ్రవరి 5 నుంచి చెన్నై వేదికగా ఇంగ్లండ్‌, టీమిండియాల మధ్య తొలి టెస్టు జరగనుంది. చదవండి: పుజారా ఆ షాట్‌ ఆడితే సగం మీసం తీసేస్తా!

మరిన్ని వార్తలు