‘బుమ్రా యాక్షన్‌తో అతనికే చేటు’

10 Aug, 2020 12:15 IST|Sakshi

గాయపడతాడని ముందే జోస్యం చెప్పా: అక్తర్‌

కరాచీ: టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌. బుమ్రా సుదీర్ఘ కాలం మూడు ఫార్మాట్లు ఆడలేడని గతంలో చెప్పిన అక్తర్‌.. మళ్లీ అదే వ్యాఖ్యలు చేశాడు. కాగా, బుమ్రా యాక్షన్‌ అతనికే చేటు చేస్తుందని ముందే ఊహించానని అక్తర్‌ తాజాగా పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని స్నేహితులతో చెబుతూ ఉండేవాడనని, అదే తాను చెప్పిన కొంతకాలానికే జరిగిందన్నాడు. (బట్లర్‌ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటో?)

‘ టెస్టు మ్యాచ్‌లో బుమ్రా ధైర్యం, సత్తా ఏమిటో చూశాం. బుమ్రాది చాలా కష్టించే తత్వం. క్రికెట్‌ బౌలింగ్‌పై ఎక్కవ దృష్టి పెడతాడు. అతను ఎక్కడికి( ఫిట్‌నెస్‌ గురించి) వెళుతున్నాడో బుమ్రాకు తెలుసు. ప్రస్తుతం నా అడిగే ప్రశ్న ఒక్కటే. బుమ్రాకు అతని వెన్నుపూస​ నుంచి పూర్తి సహకారం అందుతుందా. బుమ్రా యాక్షన్‌ అతనికే చేటు చేస్తుంది. వెన్నుగాయం బారిన పడటానికి యాక్షనే కారణం. బుమ్రా సుదీర్ఘ కాలం మూడు ఫార్మాట్లలో ఆడలేడనే విషయం కచ్చితంగా చెబుతా. బుమ్రా వెన్నుగాయం బారిన పడకముందే అతని మ్యాచ్‌లు ఎక్కువగా చూసేవాడిని. ఆ క్రమంలోనే వెన్నుగాయం ప్రమాదం బుమ్రాకు పొంచి ఉందని ఫ్రెండ్స్‌కు చెప్పేవాడిని. అదే జరిగింది. ఇప్పుడు కూడా బుమ్రా ఎక్కువ కాలం మూడు ఫార్మాట్లకు న్యాయం చేయలేడని చెబుతున్నా’ అని ఆకాశ్‌ వాణి కార్యక్రమంలో ఆకాశ్‌ చోప్రాతో మాట్లాడుతూ బుమ్రా గురించి అక్తర్‌ ఇలా స్పందించాడు. (‘వివో’ లేకుంటే నష్టమేం లేదు: గంగూలీ )

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు