సీరియల్స్‌ పైనే దృష్టంతా..

23 Dec, 2023 01:04 IST|Sakshi

గాజువాక: టీవీ సీరియల్స్‌ ద్వారా తనకు ఎనలేని ఆదరణ లభించిందని బుల్లితెర కథానాయిక మేఘనా లోకేష్‌ అన్నారు. అందుకే సినిమాల్లో అవకాశాలు వస్తున్నా ప్రస్తుతం అటువైపు వెళ్లడం లేదని, తన దృష్టంతా సీరియల్స్‌పైనే ఉందన్నారు.

మేఘనా లోకేష్‌ గాజువాకలో శుక్రవారం సందడి చేశారు. స్థానిక సీఎంఆర్‌ సెంట్రల్‌లో ఏర్పాటు చేసిన ఒక బ్రాండ్‌ స్టోర్‌ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆమె ఇక్కడి అభిమానులతో చిట్‌చాట్‌ చేశారు. ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో సీఎంఆర్‌ సెంట్రల్‌కు తరలి వచ్చారు.

>
మరిన్ని వార్తలు