మ్యాచ్‌ ఫిక్సింగ్‌.. ఎనిమిదేళ్ల నిషేధం

17 Mar, 2021 08:12 IST|Sakshi

దుబాయ్‌: మ్యాచ్‌ ఫిక్సర్లపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి కొరడా ఝుళిపించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ నవీద్, అతని సహచరుడు షైమన్‌ అన్వర్‌లపై ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. వీరిద్దరు 2019లో జరిగిన టి20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలింది. ఆరోపణలు రావడంతో అదే ఏడాది ఇద్దరినీ తాత్కాలికంగా సస్పెండ్‌ చేసిన ఐసీసీ... తదుపరి అవినీతి నిరోధక శాఖ విచారణ అనంతరం తుది నిర్ణయం వెలువరిచింది. ఫిక్సింగ్‌కు పాల్పడిన వీరిద్దరు విచారణకు కూడా సహకరించకపోవడంతో ఐసీసీ ఈ చర్య తీసుకుంది. 
చదవండి:
అతడు ఎన్నిసార్లు విఫలమైనా ఛాన్స్‌.. కానీ పాపం
‘రాననుకున్నారా! రాలేననుకున్నారా!!’

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు