-

T20 WC Ind Vs Eng: ఆసీస్‌పై ఇంగ్లండ్‌ విజయం.. ఫైనల్లో టీమిండియాతో పోరు! చరిత్రకు అడుగు దూరంలో భారత్‌..

28 Jan, 2023 09:48 IST|Sakshi
అండర్‌ 19 భారత మహిళా జట్టు (PC: BCCI)

ICC Under 19 Womens T20 World Cup 2023 - పోష్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ మూడు పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో పోరుకు సిద్ధమైంది.  టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ గ్రేస్‌ స్రివెన్స్‌ 20, అలెక్సా స్టోన్‌హౌజ్‌ 25 మాత్రమే 20కి పైగా పరుగులు స్కోరు చేశారు. దీంతో 19.5 ఓవర్లలో 99 పరుగులకే ఇంగ్లండ్‌ ఆలౌట్‌ అయింది.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఇంగ్లండ్‌ బౌలర్లు దెబ్బకొట్టారు. హన్నా బేకర్‌ మూడు, గ్రేస్‌ స్రివెన్స్‌ రెండు, జోసీ గ్రోవ్స్‌, రియానా, ఎలీ ఆండర్సన్‌, అలెక్సా స్టోన్‌హౌజ్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. దీంతో 96 పరగులకే ఆలౌట్‌ అయిన ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. హన్నా బేకర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు లభించింది.

చరిత్రకు అడుగుదూరంలో
ఆసీస్‌ బ్యాటర్లలో క్లేర్‌ మూరే 20, అమీ స్మిత్‌ 26 పరుగులతో రాణించగా.. మిగతా వాళ్లు సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం అయ్యారు. ఇప్పటి వరకు భారత మహిళల క్రికెట్‌ జట్టు ఏ ఫార్మాట్‌లోనైనా విశ్వవిజేతగా నిలువలేకపోయింది.

వన్డే ప్రపంచకప్‌లో రెండుసార్లు రన్నరప్‌గా, టి20 ప్రపంచకప్‌లో ఒకసారి రన్నరప్‌గా నిలిచింది. అయితే సీనియర్లకు సాధ్యంకాని ఘనతను సాధించేందుకు భారత జూనియర్‌ మహిళల జట్టు విజయం దూరంలో నిలిచింది.

తొలిసారి నిర్వహిస్తున్న అండర్‌–19 టి20 ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌ చేరింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులు సాధించింది.

భారత లెగ్‌ స్పిన్నర్‌ పార్శవి చోప్రా (3/20) కివీస్‌ను కట్టడి చేసింది. టిటాస్‌ సాధు, మన్నత్, షఫాలీ, అర్చన దేవి ఒక్కో వికెట్‌ తీశారు. అనంతరం భారత్‌ 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి గెలిచింది. శ్వేత సెహ్రావత్‌ (45 బంతుల్లో 61 నాటౌట్‌; 10 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీ చేసింది. సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.

చదవండి: Washington Sundar: స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిసిన సుందర్‌..
IND Vs NZ: తొలి టి20లో టీమిండియా ఓటమి..

మరిన్ని వార్తలు