Ind Vs Nz 1st Test Draw: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు ఇవీ!

29 Nov, 2021 17:54 IST|Sakshi

Ind Vs Nz 1st Test Draw: How WTC 2021 23 Points Table Changed: ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23లో భాగంగా నిర్వహించిన భారత్‌- న్యూజిలాండ్‌ తొలి టెస్టు డ్రాగా ముగిసింది. విజయం ఖరారు అనుకున్న సమయంలో చివరి వికెట్‌ తీయలేకపోవడంతో భారత్‌కు నిరాశే మిగిలింది. ఫలితంగా ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌ డ్రా అయింది. దీంతో ఇరు జట్లకు 4 పాయింట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో కివీస్‌ ఐదో స్థానానికి చేరుకోగా... భారత్‌ 30 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. 

కాగా మొట్టమొదటి డబ్ల్యూటీసీ టైటిల్‌ను సొంతం చేసుకున్న విలియమ్సన్‌ సేనకు.. 2021-23 ఎడిషన్‌లో ఇదే తొలి మ్యాచ్‌ అన్న సంగతి తెలిసిందే. భారత్‌ విషయానికొస్తే... ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడిన కోహ్లి సేన.. ప్రస్తుతం స్వదేశంలో కివీస్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది. ఇక స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు గెలిచిన శ్రీలంక(12 పాయింట్లు) ప్రథమ స్థానం ఆక్రమించింది.

లంక తర్వాతి స్థానంలో ఇండియా, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ ఉన్నాయి. ఇక 2021-23 ఎడిషన్‌లో భాగంగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టు సిరీస్‌ జరిగిన సంగతి తెలిసిందే. కాగా సిరీస్‌ లెంత్‌తో సంబంధం లేకుండా గెలిచిన ప్రతీ మ్యాచ్‌కు ఐసీసీ 12 పాయింట్లు, టై అయితే 6, డ్రా అయితే 4 పాయింట్లు కేటాయిస్తుంది.

సిరీస్‌లోని మ్యాచ్‌ల ఆధారంగా కేటాయించే పాయింట్లు
2 మ్యాచ్‌ల సిరీస్‌- 24 పాయింట్లు
3 మ్యాచ్‌ల సిరీస్‌- 36 పాయింట్లు
4 మ్యాచ్‌ల సిరీస్‌- 48 పాయింట్లు
5 మ్యాచ్‌ల సిరీస్‌- 60 పాయింట్లు

చదవండి: Ind vs Nz Test- Ravichandran Ashwin: భజ్జీ రికార్డు అధిగమించిన అశూ.. కంగ్రాట్స్‌ సోదరా!

మరిన్ని వార్తలు